స్థానిక సమరంలో జనసేన సత్తా చాటుతాం! - మెజారిటీ స్థానాల్లో పోటీకి వ్యూహరచన - కడప కార్పొరేషన్లో 18-19 స్థానాల్లో పోటీకి సన్నాహాలు - విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్..
స్థానిక సమరంలో జనసేన సత్తా చాటుతాం!
- మెజారిటీ స్థానాల్లో పోటీకి వ్యూహరచన
- కడప కార్పొరేషన్లో 18-19 స్థానాల్లో పోటీకి సన్నాహాలు
- విలేకరుల సమావేశంలో
ఎమ్మెల్యే దేవ వరప్రసాద్..
వల్లూరు మేజర్ న్యూస్
రాబోయే మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికల్లో కడప పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో జనసేన పార్టీ మెజారిటీ స్థానాల్లో పోటీ చేస్తుందని, ఆ దిశగా పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయని జనసేన పార్టీ కోఆర్డినేటర్ లోకల్ బాడీ ఎలక్షన్స్ రాజోలి ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల వ్యూహాలను వివరించారు. ఈ సందర్భంగా దేవ వరప్రసాద్ మాట్లాడుతూ కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లు, 5 మున్సిపాలిటీలు, మరో 2 నగర పంచాయతీలలో జనసేన బలాబలాలపై లోతైన విశ్లేషణ చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఏయే డివిజన్లలో పార్టీ బలంగా ఉందనే దానిపై అంచనాలు రూపొందిస్తున్నామన్నారు. కడప, కమలాపురంలో ఫోకస్ కడప కార్పొరేషన్‌లో కనీసం 18 నుంచి 19 డివిజన్లలో పోటీ చేసే ఆలోచన ఉందన్నారు. అలాగే కమలాపురం నగర పంచాయతీకి సంబంధించి స్థానిక నాయకులతో చర్చిస్తున్నామని, అక్కడ సుమారు 7 వార్డుల్లో పోటీ చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. కడప పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బలిజ సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉండటం, పవన్ కళ్యాణ్ కి ఉన్న అశేష అభిమాన గణం పార్టీకి ప్రధాన బలాలు అని ఆయన పేర్కొన్నారు. ఇతర పార్టీల కంటే జనసేనపైనే ప్రజల్లో ఎక్కువ నమ్మకం ఉందన్నారు. ప్రతి మున్సిపాలిటీ, నగర పంచాయతీ, కార్పొరేషన్లలో పార్టీ పరిస్థితిపై ఒక సమగ్ర నివేదికను సిద్ధం చేసి అధిష్ఠానానికి పంపుతామని తెలిపారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు తుది నిర్ణయాలు తీసుకుని, పార్టీ బలాన్ని ఓట్ల రూపంలోకి మలచుకుని గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జనసేన జిల్లా కోఆర్డినేటర్ జీవీ రమణ, జనసేన కమలాపురం నియోజకవర్గం ఇంచార్జ్ ఇందిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, కమలాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ రామ్ సిద్ధూ, కడప అసెంబ్లీ ఇన్చార్జ్ శంకరి శ్రీనివాస్, పార్టీ నాయకులు షరీఫ్, మరియు ఇతర జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..