రబ్బీలో గంగాయపల్లె విద్యార్థుల సత్తా రాష్ట్రస్థాయి పోటీలకు ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు - ఇద్దరు ఎంపిక ప్రిన్సిపాల్ సురేష్ అభినందనలు..
రబ్బీలో గంగాయపల్లె విద్యార్థుల సత్తా
రాష్ట్రస్థాయి పోటీలకు ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు - ఇద్దరు ఎంపిక
ప్రిన్సిపాల్ సురేష్ అభినందనలు..
వల్లూరు మేజర్ న్యూస్
మండలం గంగాయపల్లె పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్ అండ్ కళాశాల విద్యార్థులు రగ్బీ క్రీడలో ప్రతిభ చాటారు. సోమవారం పులివెందులలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల బాలుర పాఠశాలలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ఐ అండర్ - 19 బాలుర రబ్బీ ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కళాశాలలో ద్వితీయ సంవత్సరం సీఈసీ చదువుతున్న బి. రవితేజరెడ్డి, బి. హరినాథ్ రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం పట్ల పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సురేష్‌బాబు హర్షం వ్యక్తం చేసి అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సురేష్‌బాబు మాట్లాడుతూ క్రీడల్లో ప్రతిభ కనబరచడం విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని, పట్టుదలను పెంపొందిస్తుంది. రవితేజరెడ్డి, హరినాథ్ రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం కళాశాలకు గర్వకారణం. క్రీడలతోపాటు చదువులోనూ రాణిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నాం. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలి అని అన్నారు. విద్యార్థులను కళాశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, వ్యాయామ విద్యా ఉపాధ్యాయురాలు సుశీలమ్మ అభినందించి, రాష్ట్రస్థాయి పోటీల్లో విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారు..