వరి పంటలో పొటాషియం లోపం *వరి క్షేత్రాల పరిశీలనలో
పూసపాటిరేగ, సూర్య : వరి సాగు పంట క్షేత్రాలలో పొటాషియం లోపాలు ఉన్నట్టు గుర్తించినట్లు మండల వ్యవసాయ అధికారిని కే నీలిమ అన్నారు పంట క్షేత్రాల కార్యక్రమంలో భాగంగా గురువారం కుమిలి, రెల్లివలస గ్రామాల్లో వరి పొలాల ను నీలిమ రైతులతో కలిసి పరిశీలించారు. దీనిలో భాగంగా చాలా పొలాల్లో పొటాషియం లోపాన్ని గుర్తించడం జరిగిందని తెలిపారు. దీనిని నివారించడానికి ఎకరాకు 25 కేజీల పొటాస్ లేదా 13.0.45 మందును ఎకరానికి 1కేజీ వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలని సూచించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు సుడి దోమ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది కావున రైతులు పైమెట్రోజిన్ 0.6 జి ఆర్/ లీటర్ లేదా డైనోటెఫ్యూరాన్ 0.5 గ్రా లేదా ఇమిడాక్లోప్రిడ్+ ఇథిప్రోల్ 0.25 గ్రా పిచికరి చేసుకోవాలని సూచించారు. ఒకవేళ దోమ ఉధృతి ఎక్కువగా ఉంటే ఇతోఫెన్ఫ్రాక్స్ 2 మి.లీ లేదా ఫెనుబ్యుకార్బ్ 2 మి.లీ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని సూచించారు. ఆకు ముడత నివారణకు గాను క్లోరో ఫైర్ఫాస్ 2.5 ఎం.ఎల్ లేదా ఎసిఫేట్ 1.5 గ్రా లీటర్ నీటికీ కలిపి పిచికారి చేసుకొని నివారించుకోవచ్చని మండల వ్యవసాయ అధికారి నీలిమ రైతులకు సూచించారు. క్షేత్ర సందర్శనలో వ్యవసాయ విస్తరణ అధికారి వంశీకృష్ణ, కుమిలి గ్రామ వ్యవసాయ సహాయకులు గాయత్రి, రైతులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : రమేష్, పూసపాటిరేగ, విజయనగరం జిల్లా.