వైయస్ మదీనా పురంలో తప్పని రోడ్డు కష్టాలు
వేంపల్లె మేజర్ న్యూస్:
స్థానిక పంచాయతీ పరిధిలోని వైస్ మదీనపురంలో రోడ్డు వ్యవస్థ అధ్వానంగా మారిందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు మాజీ ఎంపిటిసి రహంతుల్లా ఖాన్ వెల్లడించారు. మంగళవారం స్థానిక ప్రజలతో కలిసి రోడ్డు ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దాదాపు 200 కుటుంబాలు ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నారని, వర్షాలు పడినప్పుడు గుంతలు ఏర్పడి ప్రజలు అవస్థలకు గురికావాల్సి వస్తుందన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు మండల సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ చర్యలు మాత్రం శూన్యమన్నారు. ప్రధానంగా స్కూళ్లకు వెళ్లేందుకు విధ్యార్థులకు, అత్యవసర ఆసుపత్రులకు వెళ్లాలంటే వృధ్ధులు, మహిళలకు అసౌకర్యంగా నెలకొని ఉందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని ఆ ప్రాంత వాసుల తరుపున విన్నవించారు. ఈ కార్యక్రమంలో బాబావల్లి, ఆ ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.
గండికోట షేక్ ఖదీర్, వేంపల్లె.
వైఎస్ఆర్ కడప జిల్లా.