వైశ్యుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది : నియోజకవర్గం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర
పార్వతీపురం,మేజర్ న్యూస్ : వైశ్యుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు.ఆదివారం పట్టణ ప్రధాన రహదారి పక్కన ఉన్న కలింగ వైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.నూతనంగా ఎన్నికైన అధ్యక్షులుగా కోరాడ మధుసూదనరావు (సతీష్), కార్యదర్శిగా బుడుమూరు శ్రీనివాసరావు, కోశాధికారులుగా భోగి మల్లికార్జున రావు, సంకా మల్లికార్జున రావు, పొట్నూరు గౌరీశంకర్రావు,
సంకా కిషోర్ కుమార్ , శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం “ చైర్మన్“ తదితర సంఘ సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ పుష్పగుచ్ఛాలు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజం అభివృద్ధి చెందాలంటే వైశ్యులు ముందుండాలని, వారితోపాటు అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. వైశ్యులకు ప్రభుత్వం నుండి అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పట్టణంలోని వైశ్య ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.