వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో 50 కుటుంబాలు చేరిక
చీపురుపల్లి, సూర్య : చీపురుపల్లి మేజర్ పంచాయతీ పరిధిలో 12వ వార్డు శివరాం రోడ్డు, కోటదుర్గ వీధిలో సుమారు 50 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. టీడీపీ సర్పంచ్ అభ్యర్థి రౌతు కాము నాయుడు ప్రచారంలో భాగంగా బుధవారం చేరికలు జరిగాయి. జడ్పీటీసీ వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, ఆలయ కమిటీ చైర్మన్ గవిడి నాగరాజు ఆధ్వర్యంలో మర్రి శ్రీను, ఆకుల రాంబాబు, సిదర్ల మంగ, సీదర్ల కృష్ణవేణి, ఆకుల మహేష్, నంబూరి నరసమ్మ, రెడ్డి అరుణ, పొట్నూరు అక్కునాయుడు, బూర్లి లక్ష్మి, బెవర సరోజినీ, పండూరి లక్ష్మి, పొట్నూరు కనకరాజు, మహంతి లక్ష్మి, మిల్లి గౌరీ, వల్లూరి అప్పయమ్మ, వల్లూరి సరస్వతి, ముదునూరి శారదా, వల్లూరి లక్ష్మి, మహంతి నాగరాజు, వెలుసూరి లక్ష్మి, పొట్నూరి పార్వతమ్మ, పెనుమత్స హేమ, సీదర్ల అప్పారావు, రమణ లకు తెలుగుదేశం పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.