వైసీపీ నుంచి టిడిపి తీర్థం పుచ్చుకున్న 150 మంది కార్యకర్తలు
ఆరిలోవ, సూర్య : జీవీఎంసీ, 17 వ వార్డు కూటమి అభ్యర్థి బుడుమూరి గోవింద్ ఆధ్వర్యంలో సింహగిరి కాలనీ ప్రాంతానికి చెందిన 150 వైస్సార్సీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందిస్తున్న సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు నియోజకవర్గం లో కొండవాలు ప్రాంతం అభివృద్ధి జరగడంతో పాటు బుడుమూరి గోవింద్ సేవ కార్యక్రమాలను చూసి ప్రభావితులై 150 మంది తెలుగుదేశం పార్టీ లో చేరడం జరిగిందని కుప్పిలి ప్రసాద్ బాబు పేర్కొన్నారు. నేటి నుండి 17 వ కూటమి అభ్యర్థి బుడుమూరి గోవింద్ నాయకత్వం ను బలపరుస్తూ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను పాటిస్తామని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రిపోర్టర్ : శ్రీనివాస్, అరిలోవా, విశాఖపట్నం.