BREAKING
హిమాచల్ ప్రదేశ్‌లో రైతులకు తీపి కబురు: ఆపిల్ సేకరణ ధర పెంపు వ్యాపారులకు ఊరట: యూపీఐ లావాదేవీలపై 0.28% ఎండీఆర్ మాఫీని పరిశీలిస్తున్న ఇండియన్ బ్యాంక్.. ఎండీ & సీఈవో బినోద్ కుమార్ వెల్లడి! ‘ఇన్వెస్ట్ మహారాష్ట్ర’ వేదిక ప్రారంభం: ₹8.57 లక్షల కోట్ల భారీ పెట్టుబడులకు ఒప్పందాలు పండుగల వేళ చక్కెర కృత్రిమ కొరతపై కేంద్రం కొరడా.. ఎస్పీ డాక్టర్ వినీత్ ఏడాది ప్రయాణంపై సూర్య ప్రత్యేక కథనం అమెరికా లేబర్ మార్కెట్‌లో జోరు: జూలై తర్వాత కనిష్టానికి నిరుద్యోగ క్లెయిమ్‌లు.. 1.97 లక్షలకు క్షీణత! ‘ఆ అనుభూతిని మళ్లీ ఆస్వాదించాలనుంది’: ముంబైలో ఎఫ్‌డీఏ కొరడా : తుకారాం ముండే నేతృత్వంలో మెరుపు దాడులు! పండుగల వేళ చక్కెర కృత్రిమ కొరతపై కేంద్రం కొరడా ఎయిర్‌ఫోర్స్ మెగా డీల్‌పై కన్ను: నాగ్‌పూర్‌లో C-390 మిలిటరీ విమానాల అసెంబ్లీ లైన్ ఏర్పాటుకు ‘ఎనర్జీ డ్రింక్’ లేబుల్ నిషేధంపై న్యాయపోరాటం సీల్దా రైల్వే స్టేషన్‌కు సరికొత్త శోభ: మల్టీప్లెక్స్, గేమింగ్ జోన్, స్లీపింగ్ పాడ్స్ ఏర్పాటు.. భారత్‌తో సముద్రయాన బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటాం: గ్రీస్ డిప్యూటీ మంత్రి స్టెఫానోస్ గికాస్ నేటి రాశి ఫలాలు — 2 అక్టోబర్ 2026, శుక్రవారం నేటి పంచాంగం తేదీ: 2 అక్టోబర్ 2026, శుక్రవారం

వైసీపీ నేతల వ్యాఖ్యలపై జనసేన నేతల ఫైర్ -తప్పుడు ప్రచారం మానుకోవాలని హెచ్చరిక

Select Suryaa Now
వైసీపీ నేతల వ్యాఖ్యలపై జనసేన నేతల ఫైర్ -తప్పుడు ప్రచారం మానుకోవాలని హెచ్చరిక

 పి.గన్నవరం మేజర్ న్యూస్ :వైసీపీ నేతల అసత్య ప్రచారాలు మానుకోవాలని, లేకుంటే తగిన రీతిలో బుద్ధి చెబుతామని జనసేన నాయకులు హెచ్చరించారు. పి.గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలపై జనసేన నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. స్థానిక ముంగంపాలెంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన నేతలు కుడుపూడి ఏడుకొండలు, మల్లవరపు వెంకన్న, మట్టపర్తి సూర్యనారాయణ, ఉందుర్తి ఏసుబాబు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై తాము జనసేనలో చేరామని స్పష్టం చేశారు. గతంలో ఇతర పార్టీల నేతలతో కలిసి పనిచేసిన వారే ఇప్పుడు తమపై బురదజల్ల  సరికాదన్నారు.వైసీపీ నేత గన్నవరపు శ్రీనివాసరావుకు ధైర్యముంటే గ్రామశాఖ నాయకులతో ముంగండపాలెం రావాలని, గ్రామంలో ఎవరికి బలం ఉందో తేల్చుకుందామని సవాల్ విసిరారు. ఇకనైనా మీడియా ముందు తప్పుడు ప్రకటనలు మానుకోవాలని హెచ్చరించారు.