వాసిలి ఎంపిటిసి అభ్యర్థిగా చందన
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు మండలం లోని వాసిలి ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం అభ్యర్థిగా మామిడి చందన బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.ఆత్మకూరు ఎంపీడీఓ ఆఫీసు నందు వాసిలి గ్రామం నుంచి400 మంది గ్రామ ప్రజలతొ భారీ హంగామాగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.ఆత్మకూరు ఎమ్మెల్యే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రువర్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలతో ఆత్మకూరు రూరల్ మండల టిడిపి అధ్యక్షులు సుంకర పెంచల చౌదరి సూచనలతో కోలాహలంగా మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు సుంకర పెంచల చౌదరి, పలువురు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.