BREAKING
విజయవాడ ఉత్సవ్ 2.0, దసరా వేడుకలకు కేంద్ర రైల్వే మంత్రికి ఆహ్వానం బ్రస్సెల్స్ విమానాశ్రయంలో శుక్రవారం విమానాల రద్దుకు ఏర్పాట్లు ఆర్టీసీ బస్సు–టాటా మ్యాజిక్ ఢీ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు: సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పలికిన ఆలయ ధర్మకర్తల మండలి, అధికారులు! పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజాపాలనపరివేద గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ పనీర్ vs సోయా చంక్స్.. బరువు తగ్గాలనుకునేవారికి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా? విజయ మహిళా మండలికి స్వచ్ఛత ఆంధ్ర అవార్డు మానవత్వం చాటుకున్న శాలపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కవ్వాల్ అడవుల్లో విద్యార్థుల సందడి భారతీయ జ్ఞాన సంపదపై అవగాహన కార్యక్రమాలు రైతులకు రాయితీపై అందుబాటులో శనగ విత్తనాలు బాక్సాఫీస్ వద్ద దృశ్యం 3 సునామీ.. ఐదో రోజుకే 220 కోట్ల మార్క్ దాటేసిన అజయ్ దేవగన్ చిత్రం! ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. : రంగారెడ్డి డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి

వాల్మీకి విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించిన వాల్మీకి ఉద్యోగ,ఉపాధ్యాయులు

Select Suryaa Now
వాల్మీకి విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించిన వాల్మీకి ఉద్యోగ,ఉపాధ్యాయులు

 

కళ్యాణదుర్గం టౌన్ ప్రతినిధి రంగా :-

 

కళ్యాణదుర్గం పట్టణంలోని వాల్మీకి సర్కిల్‌లో నిర్మిస్తున్న వాల్మీకి కాంస్య విగ్రహ నిర్మాణ పనులను కళ్యాణదుర్గం తాలూకాకు చెందిన వాల్మీకి ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పరిశీలించారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, విగ్రహ నిర్మాణానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. రాష్ట్రంలోనే అత్యుత్తమంగా, భారీ స్థాయిలో వాల్మీకి విగ్రహాన్ని నిర్మించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. వాల్మీకి మహర్షి గొప్పతనాన్ని, ఆయన సాహిత్య సేవలను భవిష్యత్ తరాలకు తెలియజేసే విధంగా విగ్రహ నిర్మాణం చేపట్టడం సంతోషకరమన్నారు. విగ్రహ నిర్మాణానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపుతూ పనుల పురోగతిని పరిశీలించడం అభినందనీయమని, ఆయన చేస్తున్న కృషికి కృతజ్ఞతలు తెలిపారు. విగ్రహ నిర్మాణం పూర్తయిన అనంతరం వాల్మీకి సర్కిల్‌ కళ్యాణదుర్గం పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా, వాల్మీకి సమాజానికి గర్వకారణంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా ఎమ్మెల్యే కృషి చేయాలని వారు కోరారు. వాల్మీకి సమాజానికి సంబంధించిన రిజర్వేషన్ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. వాల్మీకి సమాజం విద్య, ఉద్యోగ, సామాజిక రంగాల్లో మరింత అభివృద్ధి చెందేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యువతకు మెరుగైన విద్య, ఉద్యోగ అవకాశాలు అందేలా ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు. వాల్మీకి మహర్షి చరిత్ర, సాహిత్య సేవలు, ఆశయాలను యువతకు పరిచయం చేయడంలో ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో కళ్యాణదుర్గం తాలూకా వాల్మీకి ఉద్యోగ సంఘం అధ్యక్షుడు గులగాని, ప్రధాన కార్యదర్శి వీరభద్ర, గౌరవాధ్యక్షుడు ఎర్రిస్వామి, కోశాధికారి వన్నూరుస్వామి, సీనియర్ ఉపాధ్యాయులు తిమ్మప్ప, సంగప్ప, చెన్నకేశవ, బొమ్మయ్య, ఈరన్న, డాక్టర్ రాజేష్, పనిరాజ్, ఎన్‌జీవో నాయకులు వేణు, రామాంజనేయులు, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు. అలాగే మార్కెట్‌యార్డు చైర్మన్ లక్ష్మీ రమేష్, వాల్మీకి డైరెక్టర్ వై.పీ. రమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ గోవిందప్ప, స్థానిక కౌన్సిలర్ అచ్చువల్లి తిప్పేస్వామి తదితరులు పాల్గొని విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించారు. విగ్రహ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.