వాహన తనిఖీలు నిర్వహించిన ఎస్ఐ కుటుంబరావు
జంగారెడ్డిగూడెం మేజర్ న్యూస్: వాహనాలు తనిఖీల్లో భాగంగా ఎస్ఐ కుటుంబరావు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని వాహనదారులకు నిబంధనల ప్రకారం జరిమానాలు విధించారు.అదేవిధంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనానికి సంబంధించిన అవసరమైన పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, హెల్మెట్ ధరించడం మన ప్రాణాలను కాపాడుకోవడానికి ఎంతో ముఖ్యమని ఎస్ఐ కుటుంబరావు వివరించారు.వాహన పత్రాలు సక్రమంగా ఉంచుకోండి… హెల్మెట్ తప్పనిసరిగా ధరించండి… ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించండి.అని ఆయన ప్రజలకు సూచించారు.ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ కూడా హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు భద్రతను పెంచాలని సూచించారు
రిపోర్టర్: కె వి రమణ రావు. జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా,