ఉపాధ్యాయులు పోస్టులు భర్తీ చేయాలి
రావికమతం అక్టోబర్ 1 మేజర్ న్యూస్ : మండలంలో గర్ణికం కేజీబీవి పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని విద్యార్థినిలు కోరారు. గురువారం పాఠశాల పనితీరును అధికారుల బృందం ఆరా తీసింది. మండల పరిషత్ ప్రత్యేక అధికారి మురళి, మండల ప్రత్యేక అధికారి విజయ ప్రకాష్, ఎంపీడీవో మహేష్, తాసిల్దార్ అంబేద్కర్, డిప్యూటీ ఎండిఓ శ్రీనివాస్, గ్రామ వార్డు సచివాలయ అధికారి వర్మ, ఏపీవో చిన్నరావు తదితరులు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. పాఠశాలలో భోజనం, వసతి సమస్య మెరుగ్గా ఉందని విద్యార్థినిలు తెలిపారు. ఇంగ్లీష్, లెక్కలకు ఉపాధ్యాయులు లేరని చెప్పారు. అనంతరం విద్యార్థులతో కలిసి అధికారులు భోజనం చేశారు. మెనూ ప్రకారం సరిపడినంత భోజనం పంపిణీ చేస్తున్నారని అధికారుల దృష్టికి తెచ్చారు. భోజనం చేసిన అధికారులు అన్ని పదార్థాలు రుచికరంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులను విడిచిపెట్టి పాఠశాలలో ఉంటున్న విద్యార్థినిల కు ఇంటిని తలపించే భోజనం, తల్లిదండ్రులను మరిపించే ఆప్యాయత చూపించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.