BREAKING
చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలి.. ప్రజాసేవలో ముందుండాలి సోనీ నుంచి సరికొత్త ఎఫ్‌ఎక్స్5 సినిమా కెమెరా ఇంద్రకీలాద్రిపై పవిత్ర వృక్షాల పెంపునకు శ్రీకారం నేటి పంచాంగం 10 నవంబర్, 2026 అమ్మవారి అన్నదానానికి రూ.2.50 లక్షల విరాళం నూతన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అభినందనలు అమరేశ్వర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు దక్షిణ భారత పవర్‌లిఫ్టింగ్‌లో జోషితకు స్వర్ణం నేటి రాశి ఫలాలు 10 నవంబర్, 2026 మచిలీపట్నంలో ఈనెల 10న జాబ్‌మేళా ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్ డీకే బాలాజీ ఇద్దరు చిన్నారులను దత్తత తల్లిదండ్రులకు అప్పగించిన కలెక్టర్ హోంగార్డు కుటుంబానికి రూ.10.62 లక్షల బీమా ప్రజల నమ్మకానికి నిదర్శనం ఎన్నికల ఫలితాలు : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ ఎన్డీఏ కూటమికి ప్రజల అఖండ మద్దతు... - మరో 20 ఏళ్లు అధికారం మాదే... ఎంపీ కేశినేని చిన్ని

ఉచిత న్యాయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

Select Suryaa Now
ఉచిత న్యాయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

మచిలీపట్నం మేజర్ న్యూస్ : ఉచిత న్యాయ సహాయ సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, చట్టాలపై అవగాహన పెంచుకుని లోక్ అదాలత్, మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను సత్వరమే పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి. యామిని సూచించారు. న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా సోమవారం కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మచిలీపట్నంలోని జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి జిల్లా కోర్టు సెంటర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. "వివాదాలు వద్దు – పరిష్కారం ముద్దు", "రాజీ మార్గమే రాజమార్గం" వంటి నినాదాలతో ప్రజలకు న్యాయ సేవలపై అవగాహన కల్పించి, అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులు, యాసిడ్ దాడుల బాధితులు, అసంఘటిత రంగ కార్మికులకు ఉచిత న్యాయ సహాయంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించేందుకు న్యాయ సేవాధికార సంస్థ కృషి చేస్తోందన్నారు. ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ల ద్వారా పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారమవుతున్నాయని తెలిపారు. డిసెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో రాజీకి అనుకూలమైన సివిల్, రాజీ చేసుకోదగిన క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చని, లోక్ అదాలత్‌లో కుదిరిన రాజీకి చట్టబద్ధమైన తుది తీర్పు హోదా ఉంటుందని వివరించారు. దీనివల్ల సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు సత్వర న్యాయం లభిస్తుందన్నారు. జిల్లాలో అమలవుతున్న మధ్యవర్తిత్వం 3.0 కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 140కి పైగా కేసులు పరిష్కారమయ్యాయని, ఈ కార్యక్రమం డిసెంబర్ నెలాఖరు వరకు కొనసాగుతుందని వెల్లడించారు. కోర్టులకు వెళ్లకుండానే కమ్యూనిటీ మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించుకునే అవకాశం ఉందని, ఆసక్తి ఉన్నవారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. న్యాయ విజ్ఞాన శిబిరాలు, అవగాహన కార్యక్రమాలను కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోక్సో కోర్టు న్యాయమూర్తి జి. వెంకటేశ్వర్లు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్. వరలక్ష్మి, ఇతర న్యాయాధికారులు, న్యాయవాదులు, ప్యానెల్ న్యాయవాదులు, మధ్యవర్తులు, పారా లీగల్ వాలంటీర్లు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం నియోజకవర్గం, కృష్ణాజిల్లా.