త్వరలో ఎర్ర చెరువు అభివృద్ధికి చర్యలు
రాజాం, సూర్య : రాజాం పురపాలక సంఘం పరిధి చీపురుపల్లి రోడ్డులో ఉన్న ఎర్ర చెరువు అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కమీషనర్ ఏ రామచంద్ర రావు తెలిపారు. ఎర్రచెరువును మంగళవారం అధికారులతో కలిసి అయన పరిశీలించారు. చాలా కాలం నుండి వినియోగంలో లేకుండా ఉన్న ఎర్రచెరువును వాడుకలోకి తేవాలని ఆ పరిసర ప్రాంత ప్రజలు కమిషనర్ కి విన్నవించుకోవడంతో అయన చెరువును పరిశీలించారు. విజిలెన్స్ విచారణలో ఉన్న ఆ చెరువును ప్రజల విజ్ఞప్తి మేరకు, అక్కడి నాయకులను పిలిపించి, చెరువు చుట్టూ తిరిగి పరిశీలించారు. అయన వెంట ఏఈ సాయికిరణ్, శానిటరీ సిబ్బంది ఉన్నారు.
రిపోర్టర్ : కె జె చక్రధరి, రాజాం, విజయనగరం జిల్లా.