BREAKING
దేశవ్యాప్తంగా పెరిగిన పాల ధరలు.. విద్యుత్ మోటార్ల దొంగల ముఠా అరెస్టు అదానీ కచ్ కాపర్‌కు అంతర్జాతీయ 'కాపర్ మార్క్' గుర్తింపు ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం -నూతన ఆవిష్కరణలు నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం : ప్రొ.వై.వి.రామిరెడ్డి ఆపరేషన్ గరుడ. మెడికల్ షాప్ లపై సర్ప్రైజ్ చెకింగ్. జయచంద్రకు ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు ఆపిలేపల్లి ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ రైతాంగానికి నిజమైన పండుగ అంతర్ కళాశాలల కబడ్డీ పోటీలు ప్రారంభం సర్పంచ్ బరిలో దేవరపల్లి ఆజాద్ --అందరితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా గుర్తింపు అంతర్జాతీయ స్థాయి క్రీడల లక్ష్యంగా.... ఎస్వీయూలో 14న జాబ్ మేళా ఎస్ఎస్సి 2026-27 పరీక్ష ఫీజు గడువు తేదీలు విడుదల పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ మార్చి 2027 లో జరగనున్న ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ ను ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ విడుదల చేసినట్లు పిడుగురాళ్ల మండల విద్యాశాఖ అధికారి శ్రీ ఎండీ ఖాసీం ఒక ప్రకటనలో తెలియజేశారు. మండలంలోని అన్ని య సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా తెలుగులో సినిమా ఏసిపి సదానందం ఆధ్వర్యంలో శ్రీరాములపల్లి గ్రామంలో కమ్యూనిటీ కనెక్ట్

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనుల పరిశీలన

Select Suryaa Now
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనుల పరిశీలన

 

సూర్య ప్రతినిధి, ఒంగోలు : 

 మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించేందుకు విద్యుత్ శాఖ చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా APCPDCL డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ హెచ్‌ఆర్‌డీ) టీవీఎస్ఎన్ మూర్తి బుధవారం ప్రకాశం జిల్లాలోని ఉప్పుగుండూరు, అమ్మనబ్రోలు, కనపర్తి, వి.ఆర్.పాలెం తదితర గ్రామాల్లో పర్యటించి విద్యుత్ పునరుద్ధరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తుఫాన్ ధాటికి దెబ్బతిన్న విద్యుత్ లైన్లు, పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లు (డీటీఆర్‌లు), వ్యవసాయ పొలాల్లో నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, తెగిపడిన వైర్లను పరిశీలించి నష్టాన్ని, పునరుద్ధరణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేపడుతున్న ప్రాంతాల్లో సిబ్బందితో కలిసి పర్యటిస్తూ పనుల వేగాన్ని సమీక్షించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో ఎలాంటి జాప్యం లేకుండా అవసరమైన సిబ్బంది, సామగ్రిని సమకూర్చుకుని పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా వ్యవసాయ పంట పొలాలకు విద్యుత్ సరఫరాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని ఆదేశించారు. తుఫాన్ కారణంగా రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా విద్యుత్ వ్యవస్థను యథాస్థితికి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు.