తుని పాయకరావుపేట భవన నిర్మాణ కార్మికుల సంఘం సమావేశం.
పాయకరావుపేట అక్టోబర్ 1 మేజర్ న్యూస్.
తుని పాయకరావుపేట భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షుడు,పాండురంగ స్వామి దేవస్థానం చైర్మన్ మజ్జూరి నారాయణరావు ఆధ్వర్యంలో భవన నిర్మాణం కార్మికుల సంఘం సమావేశం నిర్వహించారు.కార్మికుల సంక్షేమానికి సంబంధించిన అంశాల పై మజ్జురి నారాయణరావు ఈ సమావేశంలో చర్చించారు.లైన్స్ క్లబ్, గురు న్యూరో హాస్పిటల్ ఆధ్వర్యంలో కార్మికుల కోసం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. కార్మికులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు.రెండు కార్మిక కుటుంబాలకు డెలివరీ గిఫ్ట్ లు రూ.20000 చొప్పున అందించారు.ఈ కార్యక్రమంలో
చందా శ్రీనివాస్ రావు,మేకల సత్తిబాబు,మెడిశెట్టి కృష్ణ,ఓలేటి రాజు,ఎరకయ్య,లయన్స్ క్లబ్ ప్రతినిధులు కలిదిండి సత్యనారాయణ,దండెం రామచంద్రరావు,పి.భద్రరావు,కె.వి రమణ, జూరెడ్డి చిరంజీవి,పోతల రమణ,జీవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.