త్రిశూల్ కార్యక్రమంలో భాగంగా రంగారాయపురంలో పోలీసుల అవగాహన సమావేశం
లక్క వరపు కోట, సూర్య: త్రిశూల్ కార్యక్రమంలో భాగంగా గురువారం సాయంత్రం రంగారాయపురం గ్రామంలో ఎల్. కోట ఎస్‌ఐ జె. రామకృష్ణ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యువత గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్‌ఐ సూచించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల భవిష్యత్తు దెబ్బతినడంతో పాటు కుటుంబాలు కూడా ఇబ్బందులకు గురవుతాయని తెలిపారు. అదేవిధంగా వాహనదారులు డ్రైవింగ్ చేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని, రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు ప్రయాణించే సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాల భద్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్‌ఐ రామకృష్ణ అవగాహన కల్పించారు.