BREAKING
బ్రస్సెల్స్ విమానాశ్రయంలో శుక్రవారం విమానాల రద్దుకు ఏర్పాట్లు ఆర్టీసీ బస్సు–టాటా మ్యాజిక్ ఢీ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు: సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పలికిన ఆలయ ధర్మకర్తల మండలి, అధికారులు! పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజాపాలనపరివేద గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ పనీర్ vs సోయా చంక్స్.. బరువు తగ్గాలనుకునేవారికి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా? విజయ మహిళా మండలికి స్వచ్ఛత ఆంధ్ర అవార్డు మానవత్వం చాటుకున్న శాలపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కవ్వాల్ అడవుల్లో విద్యార్థుల సందడి భారతీయ జ్ఞాన సంపదపై అవగాహన కార్యక్రమాలు రైతులకు రాయితీపై అందుబాటులో శనగ విత్తనాలు బాక్సాఫీస్ వద్ద దృశ్యం 3 సునామీ.. ఐదో రోజుకే 220 కోట్ల మార్క్ దాటేసిన అజయ్ దేవగన్ చిత్రం! ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. : రంగారెడ్డి డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మిట్స్‌లో ఐఈఈఈ ఎక్స్‌ప్లోర్,ఓపెన్ సైన్స్‌పై అవగాహన సదస్సు

తిరువూరు టీడీపీ వివాదంపై పల్లా ఆరా

Select Suryaa Now
తిరువూరు టీడీపీ వివాదంపై పల్లా ఆరా

నేతలను పిలిపించి వివరణ తీసుకున్న రాష్ట్ర అధ్యక్షుడు పల్లా

 టోల్‌ప్లాజా ఘటనపై చింతమనేని ప్రభాకర్‌ నుండి వివరణ తీసుకున్న పల్లా

సూర్య స్టేట్ బ్యూరో, అమరావతి : 

 తిరువూరులో టీడీపీ నేతల మధ్య వివాదం, దెందులూరులో టోల్ ప్లాజా ఘటనలపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విచారణ జరిపారు. ముందుగా తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటయ్య మధ్య నెలకొన్న వివాదంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇరువురితో విడివిడిగా సమావేశమయ్యారు. పరస్పరం చేసుకున్న ఆరోపణలు, పార్టీ అధిష్ఠానానికి అందిన ఫిర్యాదులపై ఇరువురి నుంచి వివరాలు, వివరణ కోరారు. పార్టీ అంతర్గత వ్యవహారాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు.అదేవిధంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై టోల్‌ప్లాజా ఘటనకు సంబంధించి వచ్చిన ఆరోపణలపైనా పల్లా ఆరా తీశారు. టోల్‌ప్లాజా సిబ్బంది, లారీ డ్రైవర్లు ఇచ్చిన వివరణలను పరిగణనలోకి తీసుకుని ఘటనకు సంబంధించిన వాస్తవాలను అడిగి తెలుసుకున్నారు. టోల్‌ప్లాజా ఘటనతో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు సంబంధం లేదని సంబంధిత డ్రైవర్లు, సిబ్బంది స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ అంశంపై పూర్తి వివరాలను పల్లా తెలుసుకున్నారు. వ్యక్తిగత విమర్శలు, పరస్పర ఆరోపణలకు దూరంగా ఉంటూ పార్టీ క్రమశిక్షణ, ఐక్యతను కాపాడాలని నేతలకు పల్లా సూచించారు.