తిరుమలలో భక్తుల రద్దీ..
తిరుమల:కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 23 కంపార్టుమెంట్లు నిండిపోయి బయట క్యూలైన్లలో వేచివున్నారు. టోకెన్లు లేని సర్వదర్శన భక్తులకు సుమారు 8 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉండగా, నిన్న ఒక్కరోజే శ్రీవారిని 84,179 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 29,644గా నమోదైంది. భక్తులు హుండీ ద్వారా సమర్పించిన కానుకల ద్వారా నిన్న శ్రీవారికి రూ.3.01 కోట్ల ఆదాయం సమకూరినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.