BREAKING
సెప్టెంబర్‌లో 11.39 శాతానికి ఎగబాకిన భారత హోల్‌సేల్ ధరల సూచీ ద్రవ్యోల్బణం వ్యడ్డీ రేట్ల పెరుగుదలపై బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ విశ్లేషణ ఐపీఓకు ముందే ఫ్యూజన్ సీఎక్స్ దూకుడు: యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా రూ. 315 కోట్ల నిధుల సమీకరణ! చైనాకు చెక్ పెట్టేందుకు వియత్నాంతో యూరోపియన్ యూనియన్ సన్నాహాలు డిజిటల్ సార్వభౌమత్వమే లక్ష్యం: సావరిన్ క్లౌడ్ మిషన్‌ను బలోపేతం చేసేందుకు టీసీఎస్, మేనేజ్‌ఇంజిన్ వ్యూహాత్మక భాగస్వామ్యం! బ్రిటన్ ఏఐ సేఫ్టీ రీసెర్చ్‌ కోసం 250 మిలియన్ డాలర్ల నిధులు ప్రకటించిన ఎన్విడియా ఢిల్లీ పారిశ్రామిక వాడల ఆధునీకరణే లక్ష్యం: రూ. 170 కోట్లతో రహదారులు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు శ్రీకారం! అభివృద్ధి పనులకు బ్రేక్‌ పడనివ్వం అనంతపురం నగరంలో రూ.6.30 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం 12 ప్రాంతాల్లో ఒకేసారి పనులకు భూమి పూజ.. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ కెనడా ప్రధాని మార్క్ కార్నీతో ప్రధాని మోదీ కీలక ఫోన్ సంభాషణ: వ్యూహాత్మక భాగస్వామ్యం, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యం! మహిళల సౌకర్యార్థం పింక్‌ టాయిలెట్‌ నిర్మాణానికి భూమి పూజ రూపాయిని కాపాడేందుకు ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచుతుందా? కీలక సమీకరణాలను వివరించిన గవర్నర్ సంజయ్ మల్హోత్రా! పన్ను వసూళ్లలో జోరు: 2026-27 ఆర్థిక సంవత్సర ఆదాయ లక్ష్యాలను కేంద్రం సులభంగా అధిగమించే అవకాశం! భారత్-అమెరికా వాణిజ్య ఉద్రిక్తతలు: చైనాను దూరం పెట్టొద్దన్న ఉదయ్ కొటక్.. వ్యూహాత్మక సమతుల్యతపై కీలక విశ్లేషణ! వాటర్ బిల్లులపై 319 మిలియన్ డాలర్ల కోత విధించిన బ్రిటన్ రెగ్యులేటర్ ఏఐ ఆధారిత సైబర్‌ సెక్యూరిటీ సంస్థగా ఏఏఏ టెక్నాలజీస్ రూపాంతరం: 1,000 మంది ఉద్యోగుల నియామకమే లక్ష్యం!

మహిళలకు కుట్టు మిషన్లు, పేదలకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

Select Suryaa Now
మహిళలకు కుట్టు మిషన్లు, పేదలకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

విజయవాడ సెంట్రల్, మేజర్ న్యూస్: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పేదలకు అండగా నిలుస్తూ, మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. బుధవారం ఓల్డ్ 23వ డివిజన్, న్యూ 60వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 60వ డివిజన్ ఇన్‌చార్జ్, మాజీ కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గజ్జలకొండ గజలక్ష్మి, బచ్చు జయలక్ష్మి, కె. వరలక్ష్మికి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. మహిళలు కుట్టు మిషన్ల ద్వారా స్వయం ఉపాధి పొందుతూ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న షేక్ ఇస్మాయిల్‌కు రూ.45,160, నెప్పాలి వెంకట సాయి గణేష్‌కు రూ.92,415, దొంగ సరస్వతికి రూ.53,739 విలువైన చెక్కులను అందజేశారు. ముగ్గురు లబ్ధిదారులకు కలిపి మొత్తం రూ.1,91,314 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్థిక భరోసా కల్పిస్తుందని బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని, ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

 

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.