విశ్వం ఈఈఈ విద్యార్థులచే పారిశ్రామిక సందర్శన
- విద్యుత్ శక్తి పంపిణీలో ట్రాన్స్ఫార్మర్ల ప్రాముఖ్యతపై అవగాహన
మదనపల్లె రూరల్,మేజర్ న్యూస్ : అంగళ్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ) విభాగానికి చెందిన ఫైనల్ ఇయర్ విద్యార్థులు వలసపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని సాయి భవాని ట్రాన్స్ఫార్మర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను మంగళవారం సందర్శించారు.ఈ సందర్శనలో విద్యార్థులు ట్రాన్స్ఫార్మర్ల నిర్మాణం,ప్రధాన భాగాలు,తయారీ విధానాలు,నాణ్యతా ప్రమాణాలు,పరీక్షా ప్రక్రియలు,విద్యుత్ పంపిణీలో వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నారు.తరగతి గదిలో నేర్చుకున్న సైద్ధాంతిక అంశాలను పరిశ్రమలో ఆచరణాత్మకంగా చూడటానికి ఈ పర్యటన ఎంతగానో ఉపయోగపడింది.కళాశాల చైర్మన్ ఎం.ప్రభాకర్ రెడ్డి,డైరెక్టర్ ఎం.నందిత రెడ్డి,ప్రిన్సిపాల్ డాక్టర్ బి.డి.వెంకటరమణా రెడ్డి,వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.సుబ్బారెడ్డి,ఈఈఈ విభాగాధిపతి డాక్టర్ జి.హేమకుమార్ రెడ్డి విద్యార్థులను అభినందించారు.అధ్యాపకులు టి.అన్విత,డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి సమన్వయం చేయగా,హేమకుమార్ రెడ్డి పర్యవేక్షణలో కార్యక్రమం నిర్వహించబడింది.విలువైన పారిశ్రామిక అనుభవాన్ని అందించిన సాయిభవాని ట్రాన్స్ఫార్మర్స్ యాజమాన్యానికి కళాశాల కృతజ్ఞతలు తెలిపింది.
రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి, మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి