BREAKING
సెప్టెంబర్‌లో 11.39 శాతానికి ఎగబాకిన భారత హోల్‌సేల్ ధరల సూచీ ద్రవ్యోల్బణం వ్యడ్డీ రేట్ల పెరుగుదలపై బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ విశ్లేషణ ఐపీఓకు ముందే ఫ్యూజన్ సీఎక్స్ దూకుడు: యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా రూ. 315 కోట్ల నిధుల సమీకరణ! చైనాకు చెక్ పెట్టేందుకు వియత్నాంతో యూరోపియన్ యూనియన్ సన్నాహాలు డిజిటల్ సార్వభౌమత్వమే లక్ష్యం: సావరిన్ క్లౌడ్ మిషన్‌ను బలోపేతం చేసేందుకు టీసీఎస్, మేనేజ్‌ఇంజిన్ వ్యూహాత్మక భాగస్వామ్యం! బ్రిటన్ ఏఐ సేఫ్టీ రీసెర్చ్‌ కోసం 250 మిలియన్ డాలర్ల నిధులు ప్రకటించిన ఎన్విడియా ఢిల్లీ పారిశ్రామిక వాడల ఆధునీకరణే లక్ష్యం: రూ. 170 కోట్లతో రహదారులు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు శ్రీకారం! అభివృద్ధి పనులకు బ్రేక్‌ పడనివ్వం అనంతపురం నగరంలో రూ.6.30 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం 12 ప్రాంతాల్లో ఒకేసారి పనులకు భూమి పూజ.. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ కెనడా ప్రధాని మార్క్ కార్నీతో ప్రధాని మోదీ కీలక ఫోన్ సంభాషణ: వ్యూహాత్మక భాగస్వామ్యం, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యం! మహిళల సౌకర్యార్థం పింక్‌ టాయిలెట్‌ నిర్మాణానికి భూమి పూజ రూపాయిని కాపాడేందుకు ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచుతుందా? కీలక సమీకరణాలను వివరించిన గవర్నర్ సంజయ్ మల్హోత్రా! పన్ను వసూళ్లలో జోరు: 2026-27 ఆర్థిక సంవత్సర ఆదాయ లక్ష్యాలను కేంద్రం సులభంగా అధిగమించే అవకాశం! భారత్-అమెరికా వాణిజ్య ఉద్రిక్తతలు: చైనాను దూరం పెట్టొద్దన్న ఉదయ్ కొటక్.. వ్యూహాత్మక సమతుల్యతపై కీలక విశ్లేషణ! వాటర్ బిల్లులపై 319 మిలియన్ డాలర్ల కోత విధించిన బ్రిటన్ రెగ్యులేటర్ ఏఐ ఆధారిత సైబర్‌ సెక్యూరిటీ సంస్థగా ఏఏఏ టెక్నాలజీస్ రూపాంతరం: 1,000 మంది ఉద్యోగుల నియామకమే లక్ష్యం!

వేడుకగా ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల ఆవిర్భావ దినోత్సవం

Select Suryaa Now
వేడుకగా ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల ఆవిర్భావ దినోత్సవం


- హాజరైన యూనిట్ ప్రధాన కార్యదర్శి ఎన్.మునిగోపాల కృష్ణ
మదనపల్లె,మేజర్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ 1984 అక్టోబర్ 13వ తేదీన ఏర్పాటైంది.రిజిస్ట్రేషన్ నెంబరు 15 63 /1984.ఈ సంఘం ఏర్పాటులో బషీరుద్దీన్ అహ్మద్,పి.పద్మారావు,కె.భుజంగ రెడ్డి,వి.శరవనం రామ్మూర్తి తదితరులు క్రియాశీలక పాత్ర పోషించారు.ఈ నేపథ్యంలో మంగళవారం అన్నమయ్య జిల్లా కేంద్రమైన,మదనపల్లిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.బెంగళూరు రోడ్డులోని జిఆర్టి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రాజగోపాల్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి వి.శంకరయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మదనపల్లె యూనిట్ అధ్యక్షులు బివి రమణ,ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్.ముని గోపాల కృష్ణ,ట్రెజరర్ తిమ్మయ్య,అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు,వైస్ ప్రెసిడెంట్ మురళి,కేశవరెడ్డి,మహిళా ప్రతినిధులు శకుంతలమ్మ,ధనలక్ష్మి,జాయింట్ సెక్రెటరీ జగన్మోహన్,శివప్రసాద్,రాయచోటి,పుంగనూరు,కలికిరి,వాయల్పాడు,గుర్రంకొండ,మదనపల్లి,పీలేరు మొదలగు యూనిట్ సభ్యులు హాజరై ఘనంగా ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు.మొదట రాష్ట్ర పతాకాన్ని ఆవిష్కరించి విశ్రాంత ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేశారు.ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి వి.శంకరయ్య ఇటీవల రాష్ట్ర ఎన్నికలలో రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు.ఈ శుభ సందర్భంలో అన్నమయ్య జిల్లాలోని అన్ని యూనిట్ల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు,జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు ఘనంగా సన్మానించారు.అధ్యక్షులు రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వము రెండు డి.ఆర్ లు ఇచ్చినందుకు ధన్యవాదములు తెలియజేశారు.ఇంకనూ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ జనవరి 2027 నుండి 70 సంవత్సరాల నుండి 75 సంవత్సరముల వారికి 7% నుండి 10% మరియు 75  సంవత్సరాల నుండి 80  సంవత్సరాలు వారికి 12% నుండి 15%కు పెంచుకున్నట్లు జీవో విడుదల చేశారు.రిటైర్డ్ ఉద్యోగులకు రావలసినటువంటి బకాయిలు త్వరితగతిన చెల్లించాలని డిమాండ్ చేశారు.ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి వి.శంకరయ్య మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలోని అన్ని యూనిట్ల వారు,జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు అందరూ కలిసి తనను ఘనంగా సన్మానించినందుకు ధన్యవాదములు తెలిపారు.మదనపల్లి యూనిట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మునిగోపాల కృష్ణ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి వి.శంకరయ్యకి రాష్ట్ర కార్యదర్శి పదవి ఇవ్వడం శుభసూచకమని,అన్నమయ్య జిల్లా సమస్యలను రాష్ట్రస్థాయిలో తెలియజేసి మన సమస్యల పరిష్కారానికి చేయూతగా ఉంటారని,అందరికీ అందుబాటులో ఉంటున్నారని సంతోషం వ్యక్తపరిచారు.మదనపల్లి యూనిట్ అధ్యక్షులు బివి రమణ మాట్లాడుతూ ప్రభుత్వము మనకు వెంటనే ‌ ఇంటీరియమ్ రిలీఫ్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

రీపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లె నియోజకవర్గం ఇంచార్జి