తిరుమల శ్రీవారి సన్నిధిలో మంత్రి,ఎమ్మెల్యేతో మండల ప్రముఖులు
సిఎస్ పురం,మేజర్ న్యూస్,,కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో మంగళవారం ఉదయం రాష్ట్రవిద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్,కనిగిరి ఎమ్మెల్యే ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డితో కలిసి మండలానికి చెందిన జిల్లాషీప్ సొసైటీ మాజీచైర్మన్ తోడేటిగోపి దంపతులు,మండల టీడీపీనేత గుంటిమడుగు శ్రీనివాసవర్మ దంపతులు ఉదయం విఐపి బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా దేవస్థానం అర్చకులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.