టి. నరసాపురంలో ఘనంగా అంగన్‌వాడీ ఉత్సవం
టి. నరసాపురం, మేజర్ న్యూస్: అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల సేవలు అభినందనీయమని మాజీ సర్పంచ్ మోదుగు సునంద అన్నారు. తూర్పుగూడెం అంగన్‌వాడీ కేంద్రంలో మేము సైతం మిత్ర బృందం ఆధ్వర్యంలో అంగన్‌వాడీ ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 20 మంది అంగన్‌వాడీ టీచర్లను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు ఎస్.డి. నాసర్ పాషా, కొరివి నాగేశ్వరరావు, నాగమణి, పింగుల మధు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ మరిటి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
పసుమర్తి రాము జిల్లా ఇంచార్జ్ ఏలూరు జిల్లా