BREAKING
ఘనంగా విద్యాసంస్థల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు నారాయణపేట డిసిసి అధ్యక్షులను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటానా? స్పందించిన ది రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ మోసాలకు కేంద్రం చెక్ :కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి! నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ ఆర్టీసీ ఎన్నికల్లో దూసుకుపోయిన బాణం నారాయణపేట డిపోలో కూటమికి మెజార్టీ రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జీర్ణక్రియ సజావుగా సాగేలా పాటించాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు హోప్ శతకం, రూథర్‌ఫోర్డ్ విధ్వంసం – 249 పరుగులు చేసినా భారత్‌కు తప్పని ఓటమి మానసిక ప్రశాంతత కోసం రోజువారీ జీవితంలో పాటించాల్సిన సులువైన మార్పులు ఇవే నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు!

తెలుగుదేశం పార్టీ ఇచ్చే 34 శాతం రిజర్వేషన్లు బీసీల రాజకీయ సాధికారతకు చారిత్రాత్మక నిర్ణయం

Select Suryaa Now
తెలుగుదేశం పార్టీ ఇచ్చే 34 శాతం రిజర్వేషన్లు బీసీల రాజకీయ సాధికారతకు చారిత్రాత్మక నిర్ణయం

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి అభినందనలు  – శ్రీ డా. బీద మస్తాన్ రావు యాదవ్, రాజ్యసభ సభ్యులు, నెల్లూరు

నెల్లూరు, మేజర్ న్యూస్ :    స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం అభినందనీయం.     బీసీల రాజకీయ సాధికారత, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న నిబద్ధతకు ఈ నిర్ణయం నిదర్శనం. బీసీల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గారికి, మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు.   చట్టపరంగా బీసీలకు న్యాయం చేయలేకపోయినా, పార్టీ పరంగా బీసీలకు న్యాయం చేస్తాం:   వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లి 34% రిజర్వేషన్లను అడ్డుకుని బీసీలకు తీరని ద్రోహం చేశారు. బీసీలు రాజకీయంగా, సామాజికంగా ఎదగకూడదని గొడ్డలి పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారు. బీసీలకు న్యాయం చేయాలన్నదే టీడీపీ లక్ష్యం.  వారి హక్కులను అడ్డుకోవడమే వైసీపీ వైఖిరి.    బీసీలకు 34% రిజర్వేషన్ అంశాన్ని వైసీపీ హయాంలో హైకోర్టు కొట్టివేస్తే సుప్రీంకోర్టుకు వెళ్లకుండా వదిలేసి బీసీలకు తీరని అన్యాయం చేశారు. తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో సుప్రీంకోర్టు వరకు వెళ్లి బీసీలకు న్యాయం చేసేందుకు కృషి చేయడం జరిగింది. బీసీ మంత్రుల బృందం కూడా ఢిల్లీ వెళ్లి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో చర్చించడం మా నిబద్ధతకు నిదర్శనం. రిజర్వేషన్లను 50% పరిమితికి పెంచేందుకు అవసరమైన సమాచారాన్ని కూడా అందించడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ 34% రిజర్వేషన్లను పార్టీ నుంచి ఇస్తాం. బీసీల అభ్యున్నతి, సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం.

బీసీలకు అండగా తెలుగుదేశం పార్టీ  :    తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీల అభ్యున్నతికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. 1987లో స్థానిక సంస్థల్లో బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించడం, 1995లో వాటిని 34 శాతానికి పెంచడం బీసీల రాజకీయ సాధికారత దిశగా కీలకమైన ముందడుగులు. ఈ చారిత్రాత్మక నిర్ణయాలు బీసీ వర్గాలకు ప్రజాప్రతినిధులుగా ఎదిగే అవకాశాలను విస్తరించాయి. అదే స్ఫూర్తితో నేడు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు మా నాయకత్వం తీసుకున్న చొరవ అభినందనీయం.  ఈ నిర్ణయం అమలులోకి వస్తే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు తదితర స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిధ్యం మరింత బలోపేతమవుతుంది. తద్వారా బీసీ వర్గాల సమస్యలు, అవసరాలు పాలనలో తగిన ప్రాధాన్యత పొందడంతో పాటు, ప్రజాస్వామ్య వ్యవస్థలో వారి భాగస్వామ్యం పెరుగుతుంది. రాజకీయంగా బీసీ యువతకు నాయకత్వ అవకాశాలు లభించి, తమ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే అవకాశం ఏర్పడుతుంది.  బీసీలకు న్యాయం చేయాలనే సంకల్పంతో, వారి హక్కులను పరిరక్షించేందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న చొరవ ప్రశంసనీయం. మంత్రి శ్రీ నారా లోకేష్ గారు బీసీ వర్గాల ఆకాంక్షలకు ప్రాధాన్యతనిస్తూ, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించే దిశగా కృషి చేస్తున్నందుకు బీసీల తరుపున మా ధన్యవాదాలు.