BREAKING
మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానం ఎల్ నినో సమర్థవంతం ఎదుర్కొందాం రామాపురంలో పల్లెపండుగ ఏర్పాట్లు పరిశీలన మహిళల భద్రతే ధ్యేయం.. శక్తి యాప్‌పై విస్తృత అవగాహన వడ్డెరల భూములకు రక్షణ కల్పించండి సారూ..! ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వాతావరణాన్ని విద్యార్థుల కల్పించాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. ఆటపాటలతో కూడిన విద్యను బోధించాలి ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి* నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో అదిరిపోయే ట్విస్ట్.. సెకండ్ హాఫ్‌లో బాలయ్య సర్ప్రైజ్? రామాపురం పల్లెపండుగ జయప్రదం చేయండి పల్లెపండుగ 3.0 కార్యక్రమం విజయవంతం చేయాలి :ఎమ్యెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి గ్రామ పంచాయితీ ల అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలి అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల సేవలు అభినందనీయం సచివాలయ ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి 13 ఏళ్ల ఫర్హాన్‌ ఎక్కడ? ఆచూకీ కోసం పోలీసుల గాలింపు

తెలకల వీధిలో వినాయక దర్శనం, అన్నసమారాధనలో పాల్గొన్న టిడిపి యువనాయకురాలు సిరమ్మ

Select Suryaa Now
తెలకల వీధిలో వినాయక దర్శనం, అన్నసమారాధనలో పాల్గొన్న టిడిపి యువనాయకురాలు సిరమ్మ

విజయనగరం టౌన్, సెప్టెంబరు 28, మేజర్ న్యూస్:
నగరపాలక సంస్థ పరిధిలోని గౌడు వీధి సమీపంలో ఉన్న తెలకల వీధి రామాలయం వద్ద కోదండ రామాలయ యూత్ ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఏర్పాటు చేసిన అన్నసమారాధన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది.
కోదండ రామాలయ కమిటీ సభ్యుల ప్రత్యేక ఆహ్వానం మేరకు, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె, టిడిపి యువనాయకురాలు మరియు 'చిన్న శ్రీను సోల్జర్స్' అధ్యక్షురాలు సిరమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ముందుగా ఆమె స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమిటీ సభ్యులతో కలిసి భక్తులకు అన్నప్రసాద వితరణ గావించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెలకల వీధి కోదండ రామాలయ యూత్ సభ్యులు, 'చిన్న శ్రీను సోల్జర్స్' ఉపాధ్యక్షులు తోట వాసు, చిన్న శ్రీను సోల్జర్స్ ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.