టీడీపి నాయకుని మృతికి ఎమ్మెల్యే సంతాపం
పలమనేరు సూర్య న్యూస్; పలమనేరు మున్సిపాలిటీ గడ్డూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రామప్ప మృతికి ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి తన సంతాపాన్ని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ లో క్రీయశీలకంగా వ్యవహరించే డిష్ లోక తండ్రి అయిన రామప్ప గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సోమవారం సాయంత్రం మృతి చెందారు. దీంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పట్టణ టీడీపీ నాయకులతో కలసి వెళ్ళి రామప్ప భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లోక కుటుంబీకులను పరామర్శించి తన సానుభూతిని తెలియజేశారు. ఈ సంతాప కార్యక్రమంలో నాయకులు ఆర్వీ బాలాజీ, గిరిబాబు, నాగరాజు, కృష్ణా మూర్తి గౌడ్, మదన్, లోకేష్,శ్రీనివాసులు, చెన్నరాయప్ప, రామూర్తి తదితరులున్నారు..