BREAKING
జల్సా నివాసం వెలుపల అభిమానులను పలకరించిన అమితాబ్ బచ్చన్.. ఆరోగ్య రికవరీ వేళ భారీ భద్రత నడుమ సందడి! ప్రచార కార్యక్రమంలో స్పీడ్ పెంచిన 11వ టిడిపి కౌన్సిలర్ షాకిరా మౌలాలి కర్నూలు 13వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్ కౌర్.. మిథాలీ రాజ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ టీమిండియా భవిష్యత్ స్టార్ తిలక్ వర్మ అద్భుత ప్రదర్శన.. యువ బ్యాటర్‌కు కోచ్ గాంబీర్ విలువైన సూచనలు! ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా.. 17వ డివిజన్‌లో జనసేన అభ్యర్థి భవాని రవికుమార్‌ విస్తృత ప్రచారం కర్నూలు 19వ వార్డు బుధవారపేటలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం నా అభిమానులను ఎప్పటికీ గర్వపడేలా చేస్తా.. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఎమోషనల్! జనసేన పార్టీ నుండి వైఎస్సార్‌సీపీలోకి జనసేన ఆలమూరు మండల ఉపాధ్యక్షులు కొనగళ్ల ధనరాజు నాయుడు ఎంపిపి అభ్యర్థి వెంగయ్యకు శుభాకాంక్షలు తెలిపిన టిడిపినేత బడేనాయబ్ రసూల్: జెట్ స్పీడుతో టీడీపీ 21 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రాజశేఖర్ ప్రచారం వేలం పాటల రాజకీయం మానండి : మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హితవు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జనసేన నాయకులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల – రుద్రారంలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన. అల్లుగుండులో దాడి కేసు: ఆరుగురి అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

టీడీపీలోకి 10 కుటుంబాలు!. * ఆహ్వానించిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి *

Select Suryaa Now
టీడీపీలోకి 10 కుటుంబాలు!.  * ఆహ్వానించిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి *

నరసన్నపేట, సూర్య : నరసన్నపేట మండలంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మండలంలోని వి.ఎన్‌.పురం పంచాయతీ పరిధిలోని చేనువలస గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు 10 కుటుంబాలుగా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సమక్షంలో వీరంతా టీడీపీ కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు. చేనువలస గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ సరిపల్లి మన్మధరావు, మాజీ వార్డు సభ్యులు సరిపల్లి అమ్మడు, సరిపల్లి రాజుతో పాటు పాలబోయిన నీలం రాజు, రుప్ప అప్పలనాయుడు, రుప్ప వెంకటరమణ, బెవర రాంబాబు తదితరులు వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పూతి రమణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సురవరం వెంకటరమణ, ముద్దాడ మల్లికార్జునరావు, దుంగ ప్రసాద్, సరిపల్లి జనార్ధనరావు, ప్రకాశ్, సురవరం సీతన్నాయుడు, గేదెల కేశవమూర్తి, యారబాటి అప్పారావుతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : గోపాల్ కృష్ణ, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా.