తెదేపాలోకి నందిగాం మండలం చెందిన 15 వైకాపా కుటుంబాలు
కోటబొమ్మాళి, నవంబరు 3, మేజర్ న్యూస్:
కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు తెలుగుదేశం వైపు క్యూ కడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం కళ్లాడ పంచాయతీకి చెందిన 15 వైకాపా కుటుంబాలు పార్టీ మారాయి.
కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో వీరంతా మంగళవారం పసుపు కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు. మంత్రి అచ్చెన్నాయుడు వారికి సాదరంగా ఆహ్వానం పలికారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు, మహిళా కార్యకర్తలు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పల్లెల రూపురేఖలు మార్చేలా రహదారులు, తాగునీరు వంటి మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టిందని కొనియాడారు. ప్రభుత్వ చిత్తశుద్ధిని, ప్రాధాన్యతలను గుర్తించే తాము టీడీపీలో చేరినట్లు తెలిపారు.