BREAKING
పోటీ నుంచి తప్పుకున్న రాంజీ యశ్ రాజ్ ఫిల్మ్స్ తొలి హారర్ చిత్రంలో వరుణ్ ధావన్.. దర్శకత్వం ఎవరిదంటే? రెండు ద్విచక్ర వాహనాలు డి... ఒకరు మృతి న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌కు గుర్నూర్ బ్రార్ ఎంపిక.. కుల్దీప్ యాదవ్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం సాండ్‌పేపర్ వివాదంపై డేవిడ్ వార్నర్ సంచలన ఆరోపణలు.. స్టార్క్, లయన్, హేజిల్‌వుడ్‌లను విచారించలేదంటూ క్రికెట్ ఆస్ట్రేలియాపై ఫైర్ 10వ తరగతి ఫలితాలు పై ప్రత్యేక దృష్టి టీ20 ఫార్మాట్‌లో వ్యూహాత్మక మార్పులే కీలకం.. కర్ణాటక యువ బ్యాటర్ స్మరన్ రవిచంద్రన్ ఆసక్తికర వ్యాఖ్యలు దివ్య కుటుంబానికి అండగా ఉంగుటూరు ఎమ్మెల్యే, జనసేన నాయకులు యాదవోలులో కేంద్ర బృందం పర్యటన ఘనముగా గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం ఆర్థిక ప్రమాదాలను నివారించడానికి క్రమమైన వడ్డీ రేట్ల పెంపే ఉత్తమం జెన్సన్ హువాంగ్ లేకపోతే కీలక ఒప్పందాలను కోల్పోనున్న ఎన్విడియా 73 ఏళ్ల నిరీక్షనకు తెరదించుతూ న్యూజిలాండ్‌పై అద్భుత విజయం సాధించిన వేల్స్ జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి అమెరికాలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం

తరుణవాయ మోడల్ ప్రైమరీ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
తరుణవాయ మోడల్ ప్రైమరీ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

సంగం, మేజర్ న్యూస్ :  సంగం మండలం తరుణవాయ మోడల్ ప్రైమరీ స్కూల్‌లో శుక్రవారం బాలల దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు  ఏ . సునీల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.  భారతదేశ తొలి ప్రధానమంత్రి, పిల్లలంటే అమితమైన ప్రేమ కలిగిన పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నెహ్రూ జీవిత విశేషాలు, బాలల పట్ల ఆయనకున్న ప్రేమానురాగాలు, దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవలను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.  అనంతరం విద్యార్థుల్లో ఉత్సాహం, పోటీతత్వం, సృజనాత్మకతను పెంపొందించే లక్ష్యంతో వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.  వేడుకల్లో భాగంగా విద్యార్థులకు పాయసం, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఆటపాటలు, నవ్వులు, ఆనందోత్సాహాల మధ్య పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది.  ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు,  విద్యార్థినులు పాల్గొని చిన్నారులతో కలిసి బాలల దినోత్సవ వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.