తనకల్లులోని ఓ దుకాణంలో నకిలీ ఏషియన్ పెయింట్స్ ఉత్పత్తులు గుర్తింపు
తనకల్లు కేంద్రంలోని ఓ పెయింట్స్ దుకాణంలో ఏషియన్ పెయింట్స్ పేరుతో ఉన్న నకిలీ ఉత్పత్తులను కంపెనీ ప్రత్యేక బృందం తనిఖీల్లో గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.న్ప్రజలు తమ ఇళ్లకు రంగులు వేయించు కోవడానికి ప్రముఖ కంపెనీల ఉత్పత్తు లనే నమ్మకంతో కొనుగోలు చేస్తుం టారు. అయితే ప్రముఖ బ్రాండ్ల పేరుతో నకిలీ ఉత్పత్తులు మార్కె ట్లోకి రావడం వినియోగదారుల నమ్మకాన్ని దెబ్బతీసే అంశం. ఇలాంటి ఉత్పత్తుల వల్ల ఆర్థిక నష్టంతో పాటు ఆశించిన నాణ్యత, మన్నిక కూడా లభించక పోవచ్చు.
*తక్కువ ధరే ముఖ్యమా? నాణ్యత కూడా ఆలోచించాలి*
వినియోగదారులు పెయింట్స్ కొను గోలు చేసే ముందు ఎక్కడ కొంటున్నాం? ఆ దుకాణంకంపెనీకి అధీకృత డీలరా? విక్రయిస్తున్న ఉత్పత్తి అసలైన దేనా? అనే విషయాలను పరిశీలించాలి. కేవలం తక్కువ ధరకు వస్తున్నా యని ఎక్కడ పడితే అక్కడ కొనుగోలు చేయడం సరైన నిర్ణయం కాదు.
*కంపెనీ యాజమాన్యం కఠిన చర్యలు తీసుకోవాలి*
కంపెనీ బ్రాండ్ పేరు ను దుర్వినియోగం చేస్తూ నకిలీ ఉత్పత్తులవిక్రయాలు జరిగితే వాటిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను గుర్తించిచట్టపరమైన చర్యలుతీసుకోవాలి. కంపెనీ విధి విధానాలను ఉల్లంఘించే కార్యకలాపాలపై యాజమాన్యం కఠినంగా వ్యవహరించాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి.
*ప్రజలకు విజ్ఞప్తి*
ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహ రించాలి. పెయింట్స్ కొనుగోలు చేసే సమయంలో దుకాణం విశ్వసనీ యత, కంపెనీ అధీకృత డీలర్ వివరాలు, ఉత్పత్తి సీల్, బ్యాచ్ నంబర్, బిల్లు పరిశీలించాలి. అనుమానాస్పద ఉత్పత్తులు కనిపిస్తే కంపెనీ అధికారు లకు సమాచారం అందించాలి.
*తక్కువ ధరకు ఆశపడి నాణ్యతను కోల్పోవద్దు*
ఎక్కడ కొనుగోలు చేస్తున్నాం? ఏ కంపెనీ ఉత్పత్తి కొనుగోలు చేస్తు న్నాం? ఆ దుకాణా నికి కంపెనీ గుర్తింపు ఉందా? అని ఆలోచించికొనుగోలు చేయండి. మీ ఇంటి నాణ్యత, మీ డబ్బు, మీ నమ్మకాన్ని కాపాడుకోండి.