BREAKING
భారతీయ రైతులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోడ్పాటు: జొన్న పరిశోధనలకు ఏఐతో సరికొత్త ఊతం.. గూగుల్ డీప్‌మైండ్ సీవోవో లీలా ఇబ్రహీం వెల్లడి! వీబీజీ రామ్ జీ పథకం కింద ఉపాధి కల్పించే శ్రామికుల సంఖ్యను పెంచాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి: కనిష్టాల వద్ద సెన్సెక్స్, నిఫ్టీ.. 12 శాతం వరకు దూసుకెళ్లిన న్యూ ఇండియా అస్యూరెన్స్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లు! డీమార్ట్ షేర్లలో వరుసగా మూడో రోజూ నష్టాలు: క్యూ2 ఫలితాలు నిరాశపరచడంతో 4 శాతానికి పైగా పతనం! రోడ్డు ప్రమాదంలోవ్యక్తి మృతి వార్డు కౌన్సిలర్లుగా స్థానికులకే అవకాశం కల్పించాలి పండుగ వాతావరణంలో డాక్టర్ ఎన్.సేతు జన్మదిన వేడుకలు రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు.. త్రివర్ణ పతాకంతో నిరసన తెలపడం నేరం కాదు! లోయర్ జూరాల నీటి విడుదల. ఎస్సై కంబదూరు వైసీపీ సీనియర్ నాయకుడు నారప్ప మృతి పట్ల తలారి రంగయ్య సంతాపం ఇండియా కూటమిపై అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో నేటి నుంచి భారీ వర్షాలు! వేడుకగా ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల ఆవిర్భావ దినోత్సవం చిలీలో కాపర్ మైన్ సమ్మెను విరమించేందుకు మళ్లీ ప్రారంభమైన చర్చలు నవంబర్‌లో మనీలాలో జరిగే ఆసియాన్ సదస్సుకు హాజరుకానున్న డొనాల్డ్ ట్రంప్

తాడేపల్లిలో వైఎస్ జగన్ వరుస సమావేశాలు.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

Select Suryaa Now
తాడేపల్లిలో వైఎస్ జగన్ వరుస సమావేశాలు.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

 

తాడేపల్లి:ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో తమ సమావేశాలను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు మరియు పరిశీలకులతో వైఎస్ జగన్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వేళ నేడు కూడా పార్టీ కీలక నేతలతో ఆయన భేటీ అవుతున్నారు. ముఖ్యంగా సగానికి పైగా కార్పొరేషన్లు, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై ఆయన తీవ్ర కసరత్తు చేస్తున్నారు. పార్టీకి విధేయులుగా ఉంటూ, క్షేత్రస్థాయిలో గెలుపు గుర్రాలుగా పేరున్న నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి అసంతృప్తులకు తావులేకుండా, పార్టీ శ్రేణుల మధ్య పూర్తి ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఖరారు చేసేలా ఈ సమావేశాల్లో దిశానిర్దేశం చేస్తున్నారు.