BREAKING
వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి నేటి నుండి సమ్మేటివ్-1 పరీక్షలు టెస్లా ఆటోమేటిక్ ఓటింగ్ ప్రణాళికకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆమోదం బందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్ డ్రగ్స్‌ నిల్వ భవన నిర్మాణ పనుల పరిశీలన జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసనలు బంగారు బందరుగా మచిలీపట్నం తీర్చిదిద్దుతాం అమ్మవారి శరన్నవ రాత్రి ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలన లాట్వియా విమానయాన సంస్థ 'ఎయిర్‌బాల్టిక్' అమెరికా దివాళా కోర్టును ఆశ్రయించడం పెద్ద జూదం

స్వర్ణ వార్డు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి :ఎన్జీఓ ప్రెసిడెంట్ వినతి

Select Suryaa Now
స్వర్ణ వార్డు ఉద్యోగుల సమస్యలు  పరిష్కరించండి :ఎన్జీఓ ప్రెసిడెంట్ వినతి

ప్రొద్దుటూరుమేజర్ న్యూస్ : 
స్వర్ణ వార్డు ఉద్యోగుల సమస్యలపై మున్సిపల్ కమిషనర్ తుతిక శ్రీనివాస్ విశ్వనాథ్ కి ప్రొద్దుటూరు తాలూకా ఏపీ ఎన్జీజీవో అధ్యక్షులు, జెఏసి ఛైర్మెన్ జె.రామసుబ్బయ్య యాదవ్ వినతిపత్రం సమర్పించారు. ఏపీ యన్ జి జి ఓస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇచ్చిన వినతిపత్రం లో సచివాలయం లో దాదాపు సంవత్సరం నుండి స్టేషనరీ సప్లయ్ చేయడంలేదని, స్వర్ణ వార్డు ఉద్యోగుల క్యాజువల్ లీవ్స్ మంజూరు కొరకు ఒక సెక్షన్ అధికారిని నియమించాలని ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జి ఓ నె0.7 ను త్వరితగతిన అమలుపరుచాలని తెలిపారు. ఇందుకు కమిషనర్ మాట్లాడుతూ నాకు ఏపీ యన్ జి జి ఓస్ అసోసియేషన్ సంఘం అంటే నాకు చాలా గౌరవం నేను కూడా అక్కడి నుండి వచ్చినవాడినే, అలాగే స్వర్ణ వార్డు ఉద్యోగుల సమస్యలను ఎప్పటికీ అప్పుడు పరిష్కరించడంలో ముందు ఉంటానని, వాటిని ఒకటి రెండు రోజులలో పరిష్కరిస్తానని తెలిపారు. అందుకు ప్రొద్దుటూరు తాలూకా అధ్యక్షులు జె.రామసుబ్బయ్య యాదవ్ సమస్యల పరిష్కారం దిశగా హామి ఇవ్వడంతో హర్షం వ్యక్త పరిచినారు. కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్ గతంలో తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం యం పి డి ఓ గా పనిచేయు సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 30-09-2014 వ తేదీన ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రోజు ఆ రోజులలో వృద్ధాప్య, వితంతు, అంగవైకల్యం, మూగ,చెవిటి వివిధ రకాల పింఛను పేరు "సామాజిక భద్రత పింఛను" గా పిలిచేవారు. అప్పుడు శ్రీనివాస్ విశ్వనాథ్ ఆ వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి కి మీరు ప్రజలకు సంక్షేమం కోసం వివిధ రకాల పింఛను ఇస్తున్నారు కాకపోతే ముఖ్యమంత్రి కి దృష్టికి నాయొక్క విన్నపంగా ఒక విషయం తెలియజేయాలని అనుకొంటున్నానని అన్నపుడు వారు చెప్పండి అనగా యం పి డి ఓ శ్రీనివాస్ విశ్వనాథ్ మన ప్రభుత్వం ఇస్తున వివిధ రకాల పింఛను పేరు " ఎన్టీఆర్ భరోసా " గా పేరు మార్పు గా చేస్తే బాగుంటుందని తెలపడం జరిగింది. అది కాస్త కార్య రూపందాల్చి ప్రభుత్వం జి ఓ విడుదల చేయడమైనది. ఇదే రోజున ఆ రోజు ప్రభుత్వం, ఈరోజు కూటమి ప్రభుత్వం ఒకటే కావడం పుష్కర కాలం అంటే 12 సంవత్సరాలు 30-09-2026వ తేదీ అయిన సందర్భంగా కమిషనర్ అపరజ్ఞాని, అపర ఛాన్యుకుడు, దేశ రక్షణలో ఒక మాజీ సైనికుడు,ఉద్యోగ ధర్మం లో ఎక్కడ మచ్చలేని, అవినీతికి తావులేకుండా జీవిస్తున్న మన ప్రస్తుత ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తుతిక శ్రీనివాస్ విశ్వనాథ్ కి ప్రొద్దుటూరు తాలూకా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షులు, జెఏసి ఛైర్మెన్ జె.రామసుబ్బయ్య యాదవ్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు మరియు ప్రత్యేక ధన్యవాదములు తెలిపినారు. తదుపరి కమిషనర్ కి శాలువ, బొక్కెతో సన్మానించడమైనది. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్స్ నాగార్జున, వరప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రభంజన్ రెడ్డి, ఓంకార్, నరసింహ,పీరయ్య, కిరణ్ , వెంకటనారాయణ, పరబ్రహ్మం , ప్రశాంత్ నాయుడు మరియు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు