స్వల్పకాలిక పంటల సాగు , ప్రత్యామ్నాయ పంటలపై రైతులను చైతన్యం చేయండి
నెల్లూరు రూరల్, మేజర్ న్యూస్ : ప్రస్తుత రబీ సీజన్ లో స్వల్పకాలిక పంటల సాగు మరియు ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించి ఆ దిశగా ప్రయత్నాలు సాగించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సూచించారు . శనివారం నెల్లూరు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వ్యవసాయ సాంకేతిక మరియు విస్తరణ ( ట్రైనింగ్ & విజిట్ ) సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారులు , శాస్త్రవేత్తలు రైతులకు పంటల సాగులో అనుసరించాల్సిన మెళకువలు , ప్రత్యామ్నాయ పంటల ఎంపిక , స్వల్ప కాలిక పంటల సాగుపై పలు సూచనలు చేశారు . ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ డి.ఆర్.సి డిడిఏ వి. సుమలత మాట్లాడుతూ... వ్యవసాయ రంగంలో రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు అందించి చైతన్యం చేయాలని తెలిపారు . ఏ ఆర్ ఎస్ ప్రిన్సిపాల్, శాస్త్రవేత్త డాక్టర్ యు . వినీత మాట్లాడుతూ ఈ రబీలో ప్రత్యామ్నాయ పంటలైన పెసర , జొన్న, శనగ , మినుము సాగు చేయవద్దని సూచించారు . కెవికె ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.వి సరళ రైతులకు పంటల సాగులో శాస్త్రీయ పద్ధతులపై అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని వివరించారు . స్వల్ప కాలిక వరి రకాలు , 120 రోజుల వ్యవధిలో పంట చేతికి వచ్చే స్వల్పకాలిక వరి రకాల సాగును ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు . నీటి లభ్యతను బట్టి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేందుకు రైతులు నిర్ణయం తీసుకోవాలని సూచించారు . ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ ల ఏ. డి.ఏ లు మరియు అన్ని మండలాల ఎమ్.ఏ.ఓ లు పాల్గొన్నారు .