andhrapradesh
స్వచ్ఛ ఆంధ్ర అవార్డు గ్రహీతలను సన్మానించిన ఎమ్మెల్యే
స్వచ్ఛ ఆంధ్ర అవార్డు గ్రహీతలకు ఎమ్మెల్యే సన్మానం
అవనిగడ్డ, మేజర్ న్యూస్: నియోజకవర్గంలోని రెండు ప్రభుత్వ వసతి గృహాలకు జిల్లా స్థాయి స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డులు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం స్థానిక కార్యాలయంలో అవార్డు గ్రహీతలను ఎమ్మెల్యే సత్కరించారు.
మోపిదేవి ఎస్సీ వసతి గృహ సంక్షేమ అధికారిణి యాసం శివ నాగలక్ష్మి, తలగడదీవి బీసీ వసతి గృహ సంక్షేమ అధికారిణి డి.వెస్లీ రాణిలను ఘనంగా సన్మానించారు. వసతి గృహాల్లో విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణం, ఆహ్లాదకరమైన పరిసరాలు కల్పించడం ఆదర్శనీయమన్నారు. టెన్త్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన శివ నాగలక్ష్మికి ఇటీవల జిల్లా బెస్ట్ హెచ్‌డబ్ల్యూఓ అవార్డు రావడం కూడా ప్రశంసనీయమన్నారు.
కార్యక్రమంలో ఏఎస్‌డబ్ల్యూఓ మల్లవరపు విజయ, సంక్షేమ అధికారులు ఆవుల భాస్కరరావు, కొక్కిలిగడ్డ నాగార్జున, బండ్రెడ్డి విష్ణు, షుకూర్, కే.వెంకటేశ్వరరావు, బీ.శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.-అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా