BREAKING
ఘనంగా విద్యాసంస్థల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు నారాయణపేట డిసిసి అధ్యక్షులను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటానా? స్పందించిన ది రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ మోసాలకు కేంద్రం చెక్ :కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి! నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ ఆర్టీసీ ఎన్నికల్లో దూసుకుపోయిన బాణం నారాయణపేట డిపోలో కూటమికి మెజార్టీ రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జీర్ణక్రియ సజావుగా సాగేలా పాటించాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు హోప్ శతకం, రూథర్‌ఫోర్డ్ విధ్వంసం – 249 పరుగులు చేసినా భారత్‌కు తప్పని ఓటమి మానసిక ప్రశాంతత కోసం రోజువారీ జీవితంలో పాటించాల్సిన సులువైన మార్పులు ఇవే నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు!

సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తాం

Select Suryaa Now
సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తాం

 

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం : 

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని, సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూనే రాజకీయంగా బీసీలకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. బీసీలు అధైర్యపడాల్సిన అవసరం లేదని, వారి రాజకీయ ప్రాధాన్యత, గౌరవం తగ్గకుండా తగిన చర్యలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేక విధాలుగా అడ్డంకులు సృష్టించిందని ఆరోపించారు. హైకోర్టులో న్యాయపరమైన సమస్యలు ఎదురైన నేపథ్యంలో వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని, చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించిందని పేర్కొన్నారు. హైకోర్టులో వాదనలు వినిపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో ఎందుకు అప్పీల్ చేయలేదని ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించడం వల్ల సుమారు 16,800 మంది బీసీలకు రాజకీయ అవకాశాలు దూరమయ్యాయని ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. బీసీలకు రాజకీయ సాధికారత కల్పించడంలో తెలుగుదేశం పార్టీకి చారిత్రక పాత్ర ఉందని, ఎన్టీఆర్ హయాం నుంచి చంద్రబాబు నాయుడు నాయకత్వం వరకు బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, రాజకీయ అవకాశాలు కల్పించేందుకు కృషి జరిగిందని వివరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తోందని ఆయన విమర్శించారు. బీసీలకు రాజకీయంగా మేలు చేసే నిర్ణయాలకు అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. గతంలో రిజర్వేషన్లు తగ్గించినప్పుడు వైసీపీలోని బీసీ నాయకులు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ప్రస్తుతం బీసీలకు అదనంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుకు వస్తుంటే విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. బీసీల రాజకీయ సాధికారతకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ కట్టుబడి ఉన్నారని ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. చట్టపరమైన పరిధిలో తీసుకోవాల్సిన చర్యలతో పాటు, పార్టీ పరంగా బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే దిశగా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని వెల్లడించారు. రాష్ట్ర జనాభాలో సుమారు 50 శాతం ఉన్న బీసీలకు రాజకీయాల్లో తగిన ప్రాధాన్యత, గౌరవం లభించాలని ఆయన ఆకాంక్షించారు. స్థానిక సంస్థల్లో బీసీలు ఐక్యతను చాటుతూ తమ రాజకీయ బలాన్ని నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు. బీసీల హక్కులు, రాజకీయ సాధికారత కోసం కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ కృషి కొనసాగిస్తాయని ఆయన స్పష్టం చేశారు.