BREAKING
చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలి.. ప్రజాసేవలో ముందుండాలి సోనీ నుంచి సరికొత్త ఎఫ్‌ఎక్స్5 సినిమా కెమెరా ఇంద్రకీలాద్రిపై పవిత్ర వృక్షాల పెంపునకు శ్రీకారం నేటి పంచాంగం 10 నవంబర్, 2026 అమ్మవారి అన్నదానానికి రూ.2.50 లక్షల విరాళం నూతన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అభినందనలు అమరేశ్వర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు దక్షిణ భారత పవర్‌లిఫ్టింగ్‌లో జోషితకు స్వర్ణం నేటి రాశి ఫలాలు 10 నవంబర్, 2026 మచిలీపట్నంలో ఈనెల 10న జాబ్‌మేళా ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్ డీకే బాలాజీ ఇద్దరు చిన్నారులను దత్తత తల్లిదండ్రులకు అప్పగించిన కలెక్టర్ హోంగార్డు కుటుంబానికి రూ.10.62 లక్షల బీమా ప్రజల నమ్మకానికి నిదర్శనం ఎన్నికల ఫలితాలు : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ ఎన్డీఏ కూటమికి ప్రజల అఖండ మద్దతు... - మరో 20 ఏళ్లు అధికారం మాదే... ఎంపీ కేశినేని చిన్ని

సుధాకర్స్ ఐడియల్లో దీపావళి సంబరాలు

Select Suryaa Now
సుధాకర్స్ ఐడియల్లో దీపావళి సంబరాలు

కృష్ణలంక మేజర్ న్యూస్ : కృష్ణలంకలోని సుధాకర్స్ ఐడియల్ స్కూల్లో దీపావళి పండుగను పురస్కరించుకుని చిన్నారులు, ఉపాధ్యాయులు కలిసి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ముందుగా చిన్నారులతో సంప్రదాయబద్ధంగా లక్ష్మీదేవి పూజ నిర్వహించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చిన్నారుల చేత కాకరపువ్వొత్తులు వెలిగించారు. రంగురంగుల వెలుగులతో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. పండుగ విశిష్టతను తెలియజేస్తూ ఆనందం, ఐకమత్యం, పరస్పర సంతోషాలను పంచుకోవాలని ఉపాధ్యాయులు చిన్నారులకు వివరించారు. ఈ వేడుకల్లో పాఠశాల చైర్మన్ జామి సుధాకర్ రెడ్డి, డైరెక్టర్ దేవినేని వరలక్ష్మి, ప్రిన్సిపాల్ రామకోటేశ్వరరావు, ఉపాధ్యాయినులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.   

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.