స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలి..
సీతమ్మధార, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె. రాజు పిలుపునిచ్చారు. మంగళవారం సీతమ్మదార కార్యాలయంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం ముఖ్య నాయుకులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ప్రచారానికి 18 నుంచి 20 రోజుల సమయం మాత్రమే ఉండే అవకాశం ఉన్నందున, నాయకులు, కార్యకర్తలు ముందుగానే సన్నద్ధం కావాలని సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా వెలువడే అవకాశం ఉన్నందున, నోటిఫికేషన్ వచ్చిన వెంటనే విశ్రాంతి లేకుండా ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల కార్యక్రమాలను వేగవంతం చేయాలని అన్నారు. కూటమి ప్రభుత్వం బెదిరింపులకు బయపడకుండా అన్ని స్థానాల్లోనూ విజయం సాధించే లక్ష్యంతో నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. చిన్నచిన్న విభేదాలు, పొరపాట్లు ఎదురైతే పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవాలని, వాటిని బహిరంగ చర్చలకు తీసుకెళ్లకుండా పార్టీ ఐక్యతను కాపాడాలని సూచించారు. పార్టీ జాతీయ అధ్యక్షులు వై.యస్ జగన్మోహన్ రెడ్డి నిర్దేశించిన విధానాలు, ఆదేశాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పనిచేయాలని స్పష్టం చేశారు.
ఈకార్యక్రమంలో బాణాల శ్రీనివాసరావు, కటుమూరి సతిష్, అల్లు శంకరరావు, సాడి పద్మారెడ్డి, కె.అనిల్ కుమార్ రాజు, బర్కత్ అలీ, సేనాపతి అప్పారావు, గుజ్జు వెంకటరెడ్డి, పైడి రమణ, దల్లి రామక్రిష్ణరెడ్డి, బొడ్డెటి కిరణ్, కె.సుకుమార్, పైడి శ్రీను, ఐ.రవికుమార్, బొలిరెడ్డి గోవింద్, జక్కపూడి సత్యనారాయణ, కడితి చిరంజీవి, మువ్వల సంతోష్, హరికృష్ణ, సారిపిల్లి సంతోష్, బోగవల్లి గోవింద్, బి.రామలక్ష్మీ, కె.సుశీల, తాటిపూడి రత్నం, బంగారి సురేష్, కనకరాజు, రూప, మౌళికరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : శ్రీను, సీతమ్మధార, విశాఖపట్నం.