BREAKING
విజయవాడ ఉత్సవ్ 2.0, దసరా వేడుకలకు కేంద్ర రైల్వే మంత్రికి ఆహ్వానం బ్రస్సెల్స్ విమానాశ్రయంలో శుక్రవారం విమానాల రద్దుకు ఏర్పాట్లు ఆర్టీసీ బస్సు–టాటా మ్యాజిక్ ఢీ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు: సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పలికిన ఆలయ ధర్మకర్తల మండలి, అధికారులు! పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజాపాలనపరివేద గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ పనీర్ vs సోయా చంక్స్.. బరువు తగ్గాలనుకునేవారికి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా? విజయ మహిళా మండలికి స్వచ్ఛత ఆంధ్ర అవార్డు మానవత్వం చాటుకున్న శాలపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కవ్వాల్ అడవుల్లో విద్యార్థుల సందడి భారతీయ జ్ఞాన సంపదపై అవగాహన కార్యక్రమాలు రైతులకు రాయితీపై అందుబాటులో శనగ విత్తనాలు బాక్సాఫీస్ వద్ద దృశ్యం 3 సునామీ.. ఐదో రోజుకే 220 కోట్ల మార్క్ దాటేసిన అజయ్ దేవగన్ చిత్రం! ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. : రంగారెడ్డి డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి

స్థానిక సంస్థల ఎన్నికల పటిష్ట భద్రతపై అధికారుల సమావేశం.

Select Suryaa Now
స్థానిక సంస్థల  ఎన్నికల  పటిష్ట భద్రతపై అధికారుల సమావేశం.

స్థానిక సంస్థల  ఎన్నికల  పటిష్ట భద్రతపై అధికారుల సమావేశం.

రేణిగుంట మేజర్ న్యూస్ : రాబోయే పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపడుతున్నారు. మంగళవారం రేణిగుంట ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
రేణిగుంట ఎంపీడీవో రవిచంద్ర, తహశీల్దార్ శ్రావణ్ కుమార్, అర్బన్ సీఐ జయచంద్ర, రూరల్ సీఐ మంజునాథ రెడ్డితో పాటు సంబంధిత అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక నిఘా, అదనపు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పాత నేరస్థులు, అలజడులకు పాల్పడే అవకాశం ఉన్న వారిపై నిఘా ఉంచి బైండోవర్ చర్యలు చేపడతామన్నారు. అలాగే మద్యం, మరియు నగదు అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చెక్‌పోస్టులు, మొబైల్ పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రశాంత, నిష్పక్షపాత ఎన్నికలకు ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు.