BREAKING
లారీల రాకపోకలపై నియంత్రణకు చర్యలు తీసుకోవాలి గుంతకల్లు డీఎస్పీకి ఎస్‌ఎఫ్‌ఐ వినతి గుర్రపు శ్రీనివాస్‌ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్‌ నాయకులు మీ కళ్లను ప్రేమించండి… కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోండి” కోవూరు మండలంలో పలువురు వైసీపీ నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. ప్రజా ఆస్తుల పరిరక్షణకు నంద్యాలలో "ప్రజా భిక్షాటన"-విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన అఖిలపక్షం నాయకులు డిఎస్ఆర్ హైస్కూల్ లో ఉపాధ్యాయులు ,విద్యా కమిటీ,పేరెంట్స్ తో మంత్రి నారాయణ ఆత్మీయ సమావేశం. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు. తాను పక్కా సెక్యులరిస్టును.. సైనికులే అసలైన రియల్ హీరోలు: ప్రముఖ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతుల స్వీకరణ 5,400 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపెందుకు ప్రభుత్వం కుట్ర. సైడ్ కాలువలు ధ్వంసం మాకేం పట్టదంటున్నట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ సిబ్బంది... ప్రముఖ నటుడు తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం.. ఘనంగా భజరప్ప స్మారక పురస్కార ప్రదానం మానవత్వం చాటిన త్రిపురాంతకం తహసిల్దార్ వాసుదేవరావు..... గుమ్మనూరు కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసిన పామిడి సీఐ పుష్పగుచ్ఛం అందజేసిన నూతన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మనోహర్

స్థానిక సంస్థల ఎన్నికల కు సిద్ధం కావాలి

Select Suryaa Now
స్థానిక సంస్థల ఎన్నికల కు సిద్ధం కావాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలి

గ్రామస్థాయిలో పార్టీ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలి అని తెలిపిన తన్నీరు

జగ్గయ్యపేట రూరల్ మేజర్ న్యూస్ :-స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తూ గ్రామస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు  పిలుపునిచ్చారు.
జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామంలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థాయిలో పార్టీ కార్యకలాపాలు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన సన్నాహకాలు, నాయకులు మరియు కార్యకర్తల సమన్వయం తదితర అంశాలపై పార్టీ శ్రేణులతో చర్చించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని, పార్టీ శ్రేణుల మధ్య సమన్వయాన్ని మరింత పెంచుకోవాలని తెలిపారు.
ప్రతి గ్రామంలో పార్టీ కార్యకర్తలు క్రియాశీలకంగా పనిచేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని, గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ముందుకు సాగాలని అన్నారు అనంతరం వైఎస్ఆర్ సీపీ క్యాడర్‌కు ఐడీ కార్డులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు మూడు స్వామి, జిల్లా యువజన విభాగ ఉపాధ్యక్షులు బజార్ సాయి, నియోజకవర్గ ప్రచార విభాగ అధ్యక్షులు బైరబోయిన బాబు, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి శివరాత్రి పృథ్వీరాజ్, రాష్ట్ర ఎస్టీ సెల్ విభాగ కార్యదర్శి ధారావత్ రవీంద్ర నాయక్, మండల యువజన విభాగ అధ్యక్షులు సయ్యద్ షాబుద్దీన్, సీనియర్ నాయకులు పానుగంటి బ్రహ్మ నాయుడు, గ్రామ మాజీ సర్పంచ్ ఆదిమళ్ళ ముత్యాలు, పిట్టల సత్యనారాయణ,  నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.