BREAKING
పలువురిని పరామర్శించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అండగా ఉంటామని భరోసా జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అద్దంకిలో నిరసన. యువతే దేశ భవిష్యత్తును కాపాడాలి నిజాంపేటలోని భవ్యస్ శ్రీ సూర్య అపార్ట్మెంట్లో బతుకమ్మ పండుగ కొలహలం గా చోడవరం కోదండ రామాలయానికి రఘు రూ. 50 వేల ఆర్థిక సాయం కోడి కూత వినిపించని గ్రామం.. కోడిగుడ్డు కోడి మాంసం తినని గ్రామం. రైతుబజారుకు ఆదరణ ఏదీ? రాష్ట్రస్థాయి వేదికపై చిన్నకోడూరు బైండ్ల కళాకారుల ప్రతిభ పూల సోయగాలతో పల్లెల్లో బతుకమ్మ సందడి! స్థానిక ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించాలి. జాయింట్ కలెక్టర్ గోవిందరావు అంబటి మురళీకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన వట్టిప్రోలు రంగారావు పప్పుధాన్యాలలో ఆత్మనిర్భరత దిశగా అడుగులు - దసరా సెలవుల నేపథ్యంలో జిల్లాలోని సముద్రతీరాలకు వచ్చే పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయం అద్దంకి రాజీవ్ కాలనీలో పోలీసుల 'కార్డన్ సెర్చ్'..

స్థానిక సమరానికి జనసేన సన్నద్ధం.. గన్నవరం నియోజకవర్గ సమన్వయ కమిటీ నియామకం..

Select Suryaa Now
స్థానిక సమరానికి జనసేన సన్నద్ధం..  గన్నవరం నియోజకవర్గ సమన్వయ కమిటీ నియామకం..

ఎనికెపాడు,  మేజర్ న్యూస్.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం పటిష్టమైన సమన్వయ కమిటీలను నియమించారు. మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని గన్నవరం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులను తాజాగా ప్రకటించారు. విజయవాడ రూరల్ మండల అధ్యక్షుడు పొదిలి దుర్గారావుకు కమిటీలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయనతో పాటు జి. గోవర్ధన్, ఎల్. సురేష్, పి. లక్ష్మణ్, జి. నాగబాబు, బి. నాగేంద్రమణి, పి. పుణ్యవతిని కమిటీ సభ్యులుగా నియమించారు. ఈ నియామకాలపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పొదిలి దుర్గారావు మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ విజయమే లక్ష్యంగా సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు. పార్టీకి బలమున్న ప్రతి ప్రాంతంలో పటిష్టంగా పోటీకి దిగుతామని, బరిలో నిలిచిన ప్రతి స్థానంలోనూ విజయం సాధించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతామని ధీమా వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తామని, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ స్థానిక ఎన్నికల్లో జనసేన సత్తా చాటేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

మేజర్ న్యూస్ ప్రతినిధి: గుర్రం ప్రసాద్ గన్నవరం, కృష్ణా జిల్లా.