BREAKING
శివాలయంలో  బారులు తీరిన భక్తులు టాలీవుడ్ పుట్టుక నుంచి పాన్ ఇండియా స్థాయి వరకు.. తెలుగు సినిమా ప్రస్థానంలో ఇన్ని మార్పులా! జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ రేసులో రొంగల అనూష కోదాడ నియోజకవర్గo లో పల్లె రహదారులకు మహార్దశ.జీవో ఆర్టీ నంబర్ 533 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సాయిపల్లవి సీక్రెట్‌ను బయటపెట్టిన నాగచైతన్య.. టాక్ షోలో సరదా విషయాలు వెల్లడి అనకాపల్లి జిల్లా ప్రజా పరిషత్ సీఈవోగా సత్యనారాయణ డా. జీఎస్సార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు వాయుపుత్రమార్గ్ ప్రారంభోత్సవంలో 5వ వార్డ్ నేతలు పుంగనూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పి! పోలింగ్ కేంద్రం మార్పు అంశం కలెక్టర్ దృష్టికి తీసుకువెళతాం! డర్టీ పిక్చర్ 2లో మిల్కీ బ్యూటీ తమన్నా.. బాలీవుడ్ మోస్ట్ క్రేజీ సీక్వెల్‌లో ఛాన్స్! త్వరలో మంత్రులు, శాస్త్రవేత్తలతో UCG పై విస్తృత స్థాయిలో ఉన్నత స్థాయి అవగాహన సదస్సు వైసీపీ ఇంచార్జి కరణం వెంకటేష్ ముఖ్య నాయకులతో సమావేశం మున్సిపల్ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

స్థానిక ఎన్నికలలో టిడిపి అభ్యర్థులను గెలిపిస్తాం... మీ రుణం తీర్చుకుంటాం

Select Suryaa Now
స్థానిక ఎన్నికలలో టిడిపి అభ్యర్థులను గెలిపిస్తాం... మీ రుణం తీర్చుకుంటాం

పాచిపెంట, సూర్య :  స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించి మీ రుణం తీర్చుకుంటామని కొండల మీద ఆరు పంచాయతీల సర్పంచులు ఏకధాటిగా చెప్పిన సంతోషకరమైన మాటలు. గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మంగళవారం సాయంత్రం పాచిపెంట మండలం గొట్టూరు పంచాయతీ వేటగాని వలస రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి సంధ్యారాణికి గిరిజన ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న రహదారి సమస్య పరిష్కారానికి మూడు కోట్ల 13 లక్షల రూపాయలు మంజూరు చేసి మా బాధలు పరిష్కరించిన మీకు రుణపడి ఉంటామన్నారు. పై కార్యక్రమము వేటగానివలసలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గూడెపు యుగంధర్ ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో  మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ ఈ రోజు నేను చాలా ఆనందం, సంతోషంగా ఉన్నానని మీ ఆదరణ అభిమానం ఈ విధంగా ఉండాలని వచ్చే స్థానిక ఎన్నికల్లో అందర్నీ గెలిపించాలని మీరిచ్చిన గెలుపు బహుమతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అందజేస్తానని పేర్కొన్నారు. గత ప్రభుత్వం శిలాఫలకాలతో సరిపెట్టగా, మన ప్రభుత్వం శంకుస్థాపన చేసి రోడ్డు వేసి అభివృద్ధి చేసి చూపిస్తుందని డంకా పదంగా చెప్పారు. ఈ ప్రాంతంలో రహదారులు 20 నుంచి 25 సంవత్సరాలుగా నిర్మాణం జరపకుండా పేరుకుపోయాయని అభివృద్ధికి నోచుకోలేదని గిరిజన ప్రజలు నాకు ఆవేదన పూర్వకంగా చెప్పడంతో తాను ఈ రోడ్లు నిర్మాణానికి 3.13 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశానని తెలిపారు. పాచిపెంట మండలానికి 110 కోట్ల రూపాయలు కేటాయించమని, సాలూరు నియోజకవర్గానికి  550 కోట్ల రూపాయలు అభివృద్ధి చేపట్టామని మాట తప్పని ప్రభుత్వం చంద్రబాబు నాయుడదని తాను ఎంతమందికి ఉద్యోగాలేసినా,ఎన్నో రోడ్లు మంజూరు చేసినా ఏ ఒక్కరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని బ్రోకర్లును పెట్టి దండుకోలేదని నేను తప్పు చేస్తే మీరంతా నిలదీయాలని బహిరంగ సభలో ఆమె  ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. వైసీపీలో కొంతమంది ఫేస్బుక్లో తప్పుడు మెసేజ్లు పెట్టడం మానుకోవాలని పార్టీ అధ్యక్షులు యుగంధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖి హెచ్చరించారు. అభివృద్ధి చేసింది మీకు కనబడలేదా..? 20 ఏళ్లుగా జరగని అభివృద్ధి మంత్రి సంధ్యారాణి హయాంలో జరుగుతుంటే ఓర్వలేక కొంతమంది తప్పుడు మెసేజ్లు పెడుతున్నారని ఇక అటువంటి వారిని విడిచి పెట్టమని హెచ్చరించారు. గత 20 ఏళ్లుగా జరగని అభివృద్ధి ప్రస్తుతం జరుగుతుంటే గత ప్రభుత్వం ఏమి చేసిందని యుగంధర్ ప్రశ్నించారు.ఈ సమావేశం కు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మతల బలరాం, ఉప అధ్యక్షులు పోలినాయుడు, యూత్ నాయకులు చల్ల కనక బాబు, పి ఐ యు డి శర్మ,జె ఈ శంకర రావు,మాజీ ఎంపిటిసిలు, సర్పంచులు, కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం విచ్చేశారు.

 

రిపోర్టర్ :  ప్రసాద్ రాజు, పార్వతీపురం మన్యం.