BREAKING
ఎన్నికల ఇన్చార్జి రామకృష్ణ కు స్వాగతం పలికిన రామరాజు,నాయుడు 'ఈ ఫీల్డ్‌కు నేను సరిపోనేమో'.. వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ ఆనంది కళ్యాణదుర్గం పురపోరు.. ఇక సమరమే...… చైర్‌పర్సన్‌ పీఠంపై టీడీపీ, వైకాపా గురి బరిలో పల్లవి, దొడగట్ట హర్షిణి అభ్యర్థుల ఖరారుతో వేడెక్కిన రాజకీయం.. గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీల వ్యూహాలు...… డిసెంబర్ 4న నాగ చైతన్య 'వృషకర్మ' గ్రాండ్ రిలీజ్.. ఇంటెన్స్ లుక్‌తో సరికొత్త పోస్టర్ విడుదల కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. పాల్గొన్న కలెక్టర్ దీపక్ తివారి కర్చల్ గ్రామంలో నూతన పెన్షన్ల వెరిఫికేషన్ -జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి పరిశీలన పాప్స్ (PAPSS) చెల్లింపుల వ్యవస్థలో చేరిన ఇథియోపియా సెంట్రల్ బ్యాంక్ జనయేత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డా. ఏపీజే అబ్దుల్ కలాం జయంతి* శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తో జనసేన పార్టీ నేత మిద్దెల హరి భేటీ డాలర్ దాటికి ఆఫ్రికా దేశాల కరెన్సీల తడబాటు 'కరికాల' నా కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుంది.. వైభవంగా సందీప్ కిషన్ కొత్త చిత్రం ప్రారంభోత్సవం ప్రపంచానికి డీజిల్ ఎందుకు అంత అత్యవసరం? గ్లోబల్ మార్కెట్లో తీవ్ర కొరతకు గల కారణాలు.. తెరపైకి భారత రిఫైనరీల కీలక పాత్ర! *మధిర HP Gas agency లో విజిలెన్స్ అవగాహన కార్యక్రమం* 'జైలర్ 2' సినిమాపై హీరో ధనుష్ ప్రశంసల జల్లు.. సూపర్‌స్టార్ రజినీకాంత్ మ్యాజిక్ రిపీట్ ప్రజా సంక్షేమమే ధ్యేయం.. సరికొత్త రాజకీయ వేదికగా 'పి.ఆర్.కే. పార్టీ' ఆవిర్భావం!

*స్థానిక‌ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు.... *జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాంసుందర్ రెడ్డి

Select Suryaa Now
*స్థానిక‌ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు....  *జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాంసుందర్ రెడ్డి

విజయనగరం, సూర్య : జిల్లాలో ప్రశాంతంగా, పార‌ద‌ర్శ‌కంగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు పకడ్బండీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్ లో గురువారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన 2026 స్థానిక సంస్థల రెండో సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ ను వివరించారు.      
           ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టామని చెప్పారు. పట్టణ స్థానిక సంస్థలు, మండల పరిషత్, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు, గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం వేర్వేరు తేదీలను నిర్దేశించిందని కలెక్టర్ తెలిపారు.

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు
            పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు అక్టోబర్ 14న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయగా, అక్టోబర్ 16న రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నోటీసులు జారీ చేయనున్నారు. నామినేషన్ల స్వీకరణకు అక్టోబర్ 18 చివరి తేదీ. అక్టోబర్ 19న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 21న నామినేషన్ల ఉపసంహరణ, తుది అభ్యర్థుల జాబితా ప్రకటన ఉంటాయి. అక్టోబర్ 28న పోలింగ్, అవసరమైన చోట అక్టోబర్ 29న రీపోలింగ్ నిర్వహిస్తారు. అక్టోబర్ 30న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
            ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు అక్టోబర్ 19న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్, అక్టోబర్ 21న రిటర్నింగ్ అధికారుల ఎన్నికల నోటీసులు వెలువడనున్నాయి. అక్టోబర్ 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 24న పరిశీలన, అక్టోబర్ 25న తిరస్కరించిన నామినేషన్లపై అప్పీళ్ల స్వీకరణ, అక్టోబర్ 26న అప్పీళ్ల పరిష్కారం ఉంటాయి. అక్టోబర్ 27న నామినేషన్ల ఉపసంహరణ, తుది అభ్యర్థుల జాబితా ప్రకటన జరుగుతాయి. నవంబర్ 3న పోలింగ్, అవసరమైతే నవంబర్ 4న రీపోలింగ్, నవంబర్ 5న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటాయి.

మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు
             గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించనున్నారు.
మొదటి దశ: నవంబర్ 13న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్, నవంబర్ 15న ఎన్నికల నోటీసు జారీ చేస్తారు. నవంబర్ 17 వరకు నామినేషన్లు స్వీకరించి, నవంబర్ 18న పరిశీలిస్తారు. నవంబర్ 21న ఉపసంహరణ, తుది అభ్యర్థుల జాబితా ప్రకటన ఉంటాయి. నవంబర్ 26న పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన జరుగుతాయి. అవసరమైన చోట నవంబర్ 27న రీపోలింగ్ ఉంటుంది.

రెండో దశ: నవంబర్ 16న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్, నవంబర్ 18న ఎన్నికల నోటీసు జారీ చేస్తారు. నవంబర్ 20 వరకు నామినేషన్లు స్వీకరించి, నవంబర్ 21న పరిశీలిస్తారు. నవంబర్ 24న ఉపసంహరణ, తుది అభ్యర్థుల జాబితా ప్రకటన ఉంటాయి. నవంబర్ 29న పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన జరుగుతాయి. అవసరమైన చోట నవంబర్ 30న రీపోలింగ్ ఉంటుంది.

మూడో దశ: నవంబర్ 19న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్, నవంబర్ 21న ఎన్నికల నోటీసు జారీ చేస్తారు. నవంబర్ 23 వరకు నామినేషన్లు స్వీకరించి, నవంబర్ 24న పరిశీలిస్తారు. నవంబర్ 27న ఉపసంహరణ, తుది అభ్యర్థుల జాబితా ప్రకటన ఉంటాయి. డిసెంబర్ 2న పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన జరుగుతాయి. అవసరమైన చోట డిసెంబర్ 3న రీపోలింగ్ ఉంటుంది.

               మేయ‌ర్‌, మున్సిప‌ల్ ఛైర్మ‌న్ ప‌ద‌వుల‌కు ప్ర‌త్య‌క్ష‌ ఎన్నిక‌లు, డిప్యుటీ మేయ‌ర్‌, మున్సిప‌ల్‌ వైస్‌ ఛైర్మ‌న్‌, జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్‌, మండ‌ల ప‌రిష‌త్ ఛైర్మ‌న్ ఎన్నిక‌ల‌కు ప‌రోక్ష ప‌ద్ద‌తిలో ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని తెలిపారు. డిప్యుటీ మేయ‌ర్‌, మున్సిప‌ల్ వైస్ ఛైర్మ‌న్ ప‌ద‌వుల‌కు అక్టోబ‌రు 28 నోటిఫికేష‌న్ జారీ అవుతుంద‌ని, న‌వంబ‌రు 1న ఎన్నికైన‌ స‌భ్యుల‌కు నోటీసులు అంద‌జేసి, 5వ తేదీన నిర్వ‌హించే ప్ర‌త్యేక స‌మావేశంలో ఎన్నిక జ‌రుగుతుంద‌ని తెలిపారు. ఎంపిపి, జెడ్‌పి ఛైర్మ‌న్ ప‌ద‌వుల‌కు న‌వంబ‌రు 3న నోటిఫికేష‌న్ జారీ అవుతుంద‌ని, 7న నోటీసులు ఇచ్చి, 11న ఎన్నిక‌లు నిర్వ‌హిస్తార‌ని తెలిపారు.

విజయనగరంలో పోలింగ్ తేదీ మార్చాలని అభ్యర్థన

           అక్టోబర్ 27 న శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవం జరగనున్న నేపధ్యంలో విజయనగరం కార్పొరేషన్లలో పోలింగ్, దానికి అనుగుణంగా కౌంటింగ్ తేదీలను మార్చాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు కలెక్టర్ తెలిపారు. పోలింగ్ తేదీని అక్టోబర్ 29 కి మారిస్తే అనుకూలంగా ఉంటుందని అన్నారు.
నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్, పోలింగ్, స్ట్రాంగ్ రూమ్ ల ఏర్పాటు, ఓట్ల లెక్కింపు ప్రక్రియలకు అవసరమైన సిబ్బంది, సామగ్రి, ఇతర ఏర్పాట్లను ముందస్తుగా సిద్ధం చేస్తున్నామని తెలిపారు. సున్నిత, అతి సున్నిత, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, తగిన చర్యలను తీసుకుంటున్నామని చెప్పారు. బుధ‌వారం నుంచే ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి అమ‌ల్లోకి వ‌చ్చింద‌ని, ప్ర‌తిఒక్క‌రూ నిబంధ‌న‌ల‌ను ఖ‌చ్చితంగా పాటించాల‌ని స్ప‌ష్టం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు సహకరించాలని కోరారు. శతశాతం ఓటింగ్ జరిగేందుకు కృషి చేస్తున్నామని, ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

పెద్ద పెత్తున పోలీసు బందోబ‌స్తుః ఎస్‌పి
            జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ,  జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహించే విధంగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పాత నేర‌స్తులు, గ‌తంలో గొడ‌వ‌ల‌కు పాల్ప‌డిన‌ సుమారు 20వేల మందిపై బైండోవర్ నమోదు చేశామన్నారు. వీరివ‌ద్ద‌నుంచి రూ.2ల‌క్ష‌లు నుంచి రూ.3ల‌క్ష‌లు పూచిక‌త్తు తీసుకోవ‌డం జ‌రిగింద‌న్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎవరైనా  గొడవకు దిగినా, గలాటా సృష్టించినా, వారిపై కేసులు నమోదు చేస్తామని, వారి పూచికత్తును రికవరీ చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. ఇప్ప‌టికే ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చింద‌ని, పెద్ద‌మొత్తంలో డ‌బ్బు, ఇత‌ర విలువైన సామ‌గ్రి త‌ర‌లించిన‌ప్పుడు, దానికి సంబంధించిన ప‌త్రాలు త‌ప్ప‌నిస‌రిగా చూపించాల్సి ఉంటుంద‌ని, లేదంటే సీజ్ చేస్తామ‌ని తెలిపారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌ప్పుడు ప్ర‌చారాలు చేసినా, త‌ప్పుడు స‌మాచారం ఇచ్చినా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. శుక్ర‌వారం నుంచి జిల్లాలో చెక్‌పోస్టులు ప్రారంభ‌మ‌వుతాయ‌న్నారు.  ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సజావుగా, స్వేచ్ఛగా వినియోగించే విధంగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలంతా ప్రశాంతంగా ఎన్నికలను జరిపేందుకు తమ వంతు సహకారాన్ని అందించాలని ఈ సందర్భంగా ఎస్పీ కోరారు.
            విలేకరుల సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ సేధు మాధవన్, డిఆర్ఓ సిహెచ్ సత్తిబాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ :  డేవిడ్ రాజు, విజయనగరం.