andhrapradesh
స్థానిక ఎన్నికల వేళ శాంతి భద్రతలపై పలు గ్రామాల్లో పోలీసుల అవగాహన సమావేశాలు .
నకరికల్లు : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చర్యలు చేపట్టారు. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ జగదీశ్ అదహళ్లి, ఐపీఎస్ ఆదేశాల మేరకు సత్తెనపల్లి రూరల్ సర్కిల్ పరిధిలోని చల్లగుండ్ల, చీమలమర్రి, కండ్లకుంట, రూపెనగుంట్ల గ్రామాల్లో శాంతి భద్రతలపై సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు, గ్రామ పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైన పోలీసులు ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని కాపాడుతూ, ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలకు, వివాదాలకు తావివ్వకుండా సంయమనం పాటించాలని, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని పోలీసులు తెలిపారు.
ఈ సమావేశాల్లో సత్తెనపల్లి రూరల్ సర్కిల్ సీఐ పి. కిరణ్, నకరికల్లు ఎస్‌ఐ సతీష్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.