స్కూల్ కమిటీ విజేతలకు ఘన సన్మానం
గిద్దలూరులో విజేతలను సత్కరించిన వైఎస్సార్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి
సైదాపురం మండలం మేజర్ న్యూస్ : సైదాపురం మండలంలోని గిద్దలూరు గ్రామంలో ఇటీవల జరిగిన స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. ఈ నేపథ్యంలో వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి బుధవారం గిద్దలూరు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయం సాధించిన కన్వీనర్లు, వైస్‌చైర్మన్లను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. గిద్దలూరు పంచాయతీ పరిధిలోని ఐదు పాఠశాలల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయం సాధించడం సంతోషంగా ఉందని నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. పాఠశాల కమిటీ ఎన్నికల్లోనూ రాజకీయాలు చోటుచేసుకోవడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయని, ఎవరూ అధైర్యపడవద్దని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మన్నారపు రవికుమార్ తనయుడు మన్నారపు సిద్దేష్, కంభం విజయభాస్కర్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, శ్రీనివాసరాజు, తిరకాల భాస్కర్, రాజశేఖర్‌నాయుడు, కొండాపు మోహన్‌రావు, శివయ్యనాయుడు, యోగిరాజు, చికువోలు శంకర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మల్లారపు పెంచలయ్యతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.