సిట్ నివేదికతో కూటమి ప్రభుత్వం అసత్యాలు బయటపడ్డాయి
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
:తిరుపతి లడ్డూ వ్యవహారంలో వైఎస్సార్‌సీపీ, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కూటమి నాయకులు అసత్య ప్రచారం చేశారని అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి విమర్శించారు. లడ్డూలో జంతు కొవ్వు, ఇతర పదార్థాలు కలిశాయంటూ చేసిన ఆరోపణలతో భక్తుల మనోభావాలను దెబ్బతీశారని పేర్కొన్నారు.
తిరుపతి లడ్డూ వంటి పవిత్ర ప్రసాదాన్ని రాజకీయాలకు ఉపయోగించుకోవడం తగదని ఆయన అన్నారు. ఈ వ్యవహారంపై కూటమి నాయకులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ ఆరోపణలపై సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.