BREAKING
శివాలయంలో  బారులు తీరిన భక్తులు టాలీవుడ్ పుట్టుక నుంచి పాన్ ఇండియా స్థాయి వరకు.. తెలుగు సినిమా ప్రస్థానంలో ఇన్ని మార్పులా! జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ రేసులో రొంగల అనూష కోదాడ నియోజకవర్గo లో పల్లె రహదారులకు మహార్దశ.జీవో ఆర్టీ నంబర్ 533 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సాయిపల్లవి సీక్రెట్‌ను బయటపెట్టిన నాగచైతన్య.. టాక్ షోలో సరదా విషయాలు వెల్లడి అనకాపల్లి జిల్లా ప్రజా పరిషత్ సీఈవోగా సత్యనారాయణ డా. జీఎస్సార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు వాయుపుత్రమార్గ్ ప్రారంభోత్సవంలో 5వ వార్డ్ నేతలు పుంగనూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పి! పోలింగ్ కేంద్రం మార్పు అంశం కలెక్టర్ దృష్టికి తీసుకువెళతాం! డర్టీ పిక్చర్ 2లో మిల్కీ బ్యూటీ తమన్నా.. బాలీవుడ్ మోస్ట్ క్రేజీ సీక్వెల్‌లో ఛాన్స్! త్వరలో మంత్రులు, శాస్త్రవేత్తలతో UCG పై విస్తృత స్థాయిలో ఉన్నత స్థాయి అవగాహన సదస్సు వైసీపీ ఇంచార్జి కరణం వెంకటేష్ ముఖ్య నాయకులతో సమావేశం మున్సిపల్ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

శ్రీశైలం ప్రాజెక్టుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు

Select Suryaa Now
శ్రీశైలం ప్రాజెక్టుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు

 *రెండు తెలుగు రాష్ట్రాలకు శ్రీశైలం ప్రాజెక్టు గర్వకారణం*

 *ఇంజినీరింగ్ పటిష్ఠత, విద్యుత్ ఉత్పత్తి, బహుముఖ ప్రయోజనాలకు గుర్తింపు* *సీఎం చంద్రబాబు ముందుచూపుతో అందుబాటులోకి పట్టిసీమ ప్రాజెక్టు* *ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్*

సూర్య స్టేట్ బ్యూరో, అమరావతి : 

  శ్రీశైలం ప్రాజెక్టుకు వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కడం తెలుగు రాష్ట్రాల ప్రజలకు గర్వకారణమని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. డ్యామ్‌ నిర్మాణ పటిష్ఠత, జలవిద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం, సాగు, తాగు నీటి అవసరాలకు అందిస్తున్న సేవలకు అంతర్జాతీయ గుర్తింపు లభించడం ఆనందంగా ఉందని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. శ్రీశైలం జలాశయం దశాబ్దాలుగా భారీ వరదలను తట్టుకుంటూ ప్రజలకు సేవలందిస్తోందని మంత్రి తెలిపారు. ఇది కేవలం విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం మాత్రమే కాదని, లక్షలాది మంది తాగునీటి అవసరాలతో పాటు లక్షల ఎకరాల సాగునీటి అవసరాలను తీరుస్తున్న బహుళార్థ సాధక ప్రాజెక్టు అని వివరించారు. కృష్ణా జలాల వినియోగంలో కీలక పాత్ర పోషిస్తున్న శ్రీశైలం ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో విశేషమైన ప్రాధాన్యం కలిగి ఉందన్నారు. *పట్టిసీమతో రాయలసీమకు ప్రయోజనం* ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో పట్టిసీమ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావడం వల్ల శ్రీశైలం జలాలను రాయలసీమ అవసరాలకు మరింత సమర్థంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడిందని గొట్టిపాటి పేర్కొన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు ఇప్పటివరకు సుమారు 500 టీఎంసీల నీటిని అందించడం వల్ల శ్రీశైలం జలాలను రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించుకునేందుకు వెసులుబాటు కలిగిందన్నారు. కృష్ణా డెల్టా రైతులకు అవసరమైన నీటిని అందిస్తూనే రాయలసీమ ప్రాంత అవసరాలకూ శ్రీశైలం జలాశయం అండగా నిలుస్తోందని తెలిపారు. అందుబాటులో ఉన్న జలవనరులను సమర్థంగా వినియోగించడం, ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా నీటిని సద్వినియోగం చేయడంలో ముఖ్యమంత్రి ముందుచూపు స్పష్టంగా కనిపిస్తోందని మంత్రి పేర్కొన్నారు.