శ్రీచైతన్య పాఠశాలలో ఉచిత దంత పరీక్షలు -చిన్నారులకు దంత సంరక్షణపై అవగాహన
తిరుపతిలోని శ్రీచైతన్య పాఠశాలలో హ్యాపీ ఇండియా-హ్యాపీ ఇండియా స్మైల్ టిమింగ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉచిత దంత పరీక్షలు నిర్వహించారు. ప్రముఖ దంతవైద్యురాలు డా.శ్వేత ఆధ్వర్యంలో పిల్లలకు పరీక్షలు చేసి, దంత సమస్యలు, నివారణపై చక్కగా వివరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏజీఎం సురేష్ మాట్లాడుతూ పిల్లలు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. శ్రీచైతన్య సంస్థ పిల్లలకు అన్ని రకాల సంరక్షణను పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పి.లక్ష్మీ ప్రసన్న, పిల్లలు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.