శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో రాహుకాల పూజలు
నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్ : నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం రాహుకాల పూజలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. విశేషంగా జరిగిన రాహుకాల ఉద్యాపన పూజలో భక్తులు పాల్గొని అమ్మవారికి చీరజాకెట్టు, 108 నిమ్మకాయల మాలలను సమర్పించారు. శుక్రవారం అన్నదాన పంపిణీని బయోమెట్రిక్ విధానం ద్వారా క్రమబద్ధంగా నిర్వహించారు. భక్తులు స్వచ్ఛందంగా విరాళాలు అందించి ఈ అన్నదాన యజ్ఞంలో భాగస్వాములు కావాలని ఆలయ అధికారులు కోరారు. శుక్రవారం సాయంత్రం వేదపారాయణం అనంతరం, సంధ్యామేళం, కుంభహారతులు, పల్లకీ సేవ వంటి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఆలయ సహాయ కమీషనర్, కార్యనిర్వహణాధికారి నూతలపాటి శ్రీధర్ నాయుడు, ఆలయ ఛైర్మన్ శిరీష, ధర్మకర్తల మండలి సభ్యుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలన్నీ అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ప్రధాన అర్చకులు రఘురామమూర్తి నేతృత్వంలో వేద పండితులు, అర్చక బృందం పూజాది కార్యక్రమాలను విజయవంతం చేశారు.