శరన్నవరాత్రి ఉత్సవాలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కి ఆహ్వా నం.
శరన్నవరాత్రి ఉత్సవాలుకు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కి ఆహ్వానం
ఏపీ స్టేట్ బ్యూరో, అమరావతి :
విజయవాడలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను, విజయవాడ ఉత్సవ్ 2.0ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కలిసి ఆహ్వానించారు.
విజయవాడలో నిర్వహించనున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు హాజరుకావాలని, అలాగే విజయవాడ ఉత్సవ్ 2.0లో పాల్గొనాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సువేందు అధికారికి ఆహ్వాన పత్రికలను అందజేశారు.
ఈ సందర్భంగా విజయవాడలో జరగనున్న శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0 ప్రత్యేకతలను కేంద్ర మంత్రి వివరించారు. ఉత్సవాల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.విజయవాడ నగర ప్రత్యేకతను, తెలుగు సంస్కృతి–సంప్రదాయాలను ప్రతిబింబించేలా విజయవాడ ఉత్సవ్ 2.0ను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమాలకు సువేందు అధికారి హాజరై ఉత్సవాల్లో పాల్గొనాలని కేంద్ర మంత్రి కోరారు. ఆహ్వానాన్ని సువేందు అధికారి స్వీకరించారు.